మేరుగుపై తప్పుడు కేసు..

నిజం ఒప్పుకున్న మహిళ

ప్రమాణ పత్రం దాఖలు

 విజయవాడ: తనపైన ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో తాడేపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ మాజీ మంత్రి మేరుగు నాగార్జున దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది.

విచారణ సందర్భంగా తనకు, మేరుగు నాగార్జునకి ఎటువంటి సంబంధం లేదంటూ ఆ మహిళ ప్రమాణ పత్రం దాఖలు చేసింది. తనను కొంతమంది భయపెట్టడం వల్లే మేరుగ నాగార్జునపైన తప్పుడు కేసు పెట్టానని పద్మావతి స్పష్టం చేసింది.  తనపై ఆయన ఎలాంటి దాడి చేయలేదని ఆమె పేర్కొంది.

‘‘తాను ఆయనకు డబ్బులు ఇవ్వలేదు. కొంతమంది రాజకీయం కోసం నన్ను పావుగా వాడుకున్నారు. కొన్ని ఒత్తిళ్లు, అయోమయానికి గురై తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టాల్సి వచ్చింది. మూడు రోజుల క్రితమే ఈ విషయాన్ని తాడేపల్లి పోలీసులు కూడా తెలిపానని ప్రమాణపత్రంలో పద్మావతి తెలిపింది.
 
 

Back to Top