అమరావతి: గ్రామం నుంచి రాజధానుల వరకు నాలుగున్నరేళ్లలో జగనన్న ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, సాధించిన విజయాలను ప్రజలకు వివరించే కార్యక్రమమే ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలంటే.. వ్యవసాయం, పరిశ్రమలు, జీఎస్‌డీపీ, తలసరి ఆదాయం, ఉద్యోగాల కల్పన, విద్య ఇలా ప్రతీ అంశంలో జగనన్న ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ఇంటింటికీ వెళ్లి వివరించి.. మన జగనన్ననే మళ్లీ సీఎం చేసుకోవాలని అని చెప్పే గొప్ప కార్యక్రమమే వై ఏపీ నీడ్స్ జగన్..గురువారం వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా అట్టహాసంగా ప్రారంభమైంది. అనంతపురం జిల్లా గోరంట్ల మండల పరిధిలోని సచివాలయం 1లో మాజీ మంత్రి శంకర్ నారాయణ వై ఏపీ నీడ్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సచివాలయ పరిధిలో మొత్తం సంక్షేమ పథకాల లబ్ధిదారుల సంఖ్య, ప్రతి పథకానికి పంపిణీ చేయబడిన మొత్తాన్ని హైలైట్ చేస్తూ "సంక్షేమ పథకాల బోర్డ్" ను ఎమ్మెల్యే శంకర్ నారాయణ ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. " "వై ఏపీ నీడ్స్ జగన్" కార్యక్రమం డిసెంబర్ 19 వరకూ జరుగుతుందని, ఈ కార్యక్రమంలో సచివాలయం శిబిరాలు, గడప గడపకు వంటి రెండు కీలక దశలు ఉంటాయని, అలాగే సచివాలయం కన్వీనర్లు, గృహ సారథిలు, గ్రామ/వార్డు వాలంటీర్లు ప్రతి ఇంటికి చేరుకుని వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఈ నాలుగున్నర ఏళ్లలో సాధించిన అభివృద్ధి విజయాలను, 2019లో ఇచ్చిన హామీలను 99 శాతం నెరవేర్చిన విషయాన్ని మేనిఫెస్టో చూపిస్తూ అలాగే జగనన్న పాలనలో జరిగిన మంచిని ప్రజలకు వివరిస్తామన్నారు. మళ్లీ జగనన్నని సీఎంగా చేసుకోవాలని చెప్పే అద్భుతమైన కార్యక్రమమే "వై ఏపీ నీడ్స్ జగన్.." అని అన్నారు. ఆనంతరం సచివాలయం కన్వీనర్లు, గృహ సారథిలు, గ్రామ/వార్డు వాలంటీర్లుతో కలిసి సంక్షేమం, మ్యానిఫెస్టో హామీలు, రాష్ట్ర అభివృద్ధి గణాంకాలతో కూడిన బ్రౌచర్ తో ప్రతి గడపకూ వెళ్లి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రజలకు చేసిన మంచిని వివరించడంతో పాటు గత ప్రభుత్వం హామీలు ఇచ్చి ఎలా మోసం చేసిందో ఎండగడుతామని ఎమ్మెల్యే శంకర్ నారాయణ తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు,జేసీఎస్ కన్వీనర్లు, సర్పంచ్లు, వాలంటీర్లు, గృహ సారథులు, తదితరులు పాల్గొన్నారు.