అభివృద్ధి గురించి చంద్రబాబుకు ఏం తెలుసు

మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

విశాఖపట్నం: ఐదేళ్లలో చంద్రబాబు సమావేశాలు నిర్వహించడం తప్ప చేసిందేమీ లేదని, అభివృద్ధి గురించి చంద్రబాబుకు ఏం తెలుసు అని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్ర‌శ్నించారు. విశాఖపట్నంలో సీఎం పర్యటన, విశాఖ ఉత్సవ్‌ ఏర్పాట్లు, వార్డుల విభజనపై మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) ఎన్నికలకు అడ్డంకులు తొలగిపోయాయన్నారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయన్నారు. 

దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే విశాఖలో ఐటీ అభివృద్ధి జరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. అభివృద్ధి చేశానని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు విడ్డూరమన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. రాజధానిపై కేబినెట్, సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయం తీసుకుంటారని వివరించారు. 
 

Back to Top