7కి ఏడు ఎమ్మెల్సీలను మేమే గెలుస్తాం

మంత్రి బొత్స సత్యనారాయణ
 

అమరావతి: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 7 స్థానాలకు ఏడు ఎమ్మెల్సీలను మేమే గెలుస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. గురువారం మీడియా పాయింట్‌ వద్ద మంత్రి మాట్లాడారు. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్‌ మాటలు గొప్పలు చెప్పుకోవడానికే పనికి వస్తాయన్నారు. రాజీనామా ఆమోదిస్తే స్పీకర్‌ చెబుతారు కదా అని ప్రశ్నించారు. గంటా అతని పబ్లిసిటీ కోసం చెప్పుకుంటే మేమెందుకు సమాధానం చెప్పాలని అన్నారు. టీడీపీ నేతలకు నిలకడ లేదని ధ్వజమెత్తారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top