అనంతలో అన్ని నియోజకవర్గాల్లో విజయం సాధిస్తాం

ప్రజల నుంచి విపరీతమైన స్పందన లభిస్తుంది
ఉరవకొండ వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థి వై.విశ్వేశ్వర్‌రెడ్డి

ఉరవకొండ: అనంతపురం జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలుచుకుంటుందని ఉరవకొండ వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థి వై. విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ఉరవకొండలో ఆయన నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో విపరీతమైన స్పందన కనిపిస్తుందని, తప్పకుండా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుంటామని ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి అంటున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపక్ష నేత, ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై కనీస మర్యాద కూడా పాటించడం లేదన్నారు. రాజ్యాంగ బద్ధమైన వాటిని కూడా ఎప్పుడూ పాటించలేదన్నారు. ఐదేళ్ల కాలంలో ఒక్క రూపాయి కూడా నియోజకవర్గ అభివృద్ధికి నిధుల కేటాయించలేదని మండిపడ్డారు. కష్టపడి తెచ్చుకున్న డబ్బును కూడా కుట్ర పూరితంగా రద్దు చేయించాడని మండిపడ్డారు. వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యేలను నిర్వీర్యం చేయాలనే దుర్దుదేశంతో చంద్రబాబు ఇన్నాళ్లూ కుట్రలు చేశాడని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలుపై పోరాటం చేయడం వల్ల ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుందన్నారు. 

పయ్యావుల కేశవ్‌ అత్యంత అసమర్థుడిగా రుజువు చేసుకున్నాడని వై. విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ విప్‌గా ఉన్నా కూడా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసిన దాఖలాలు లేవన్నారు. హంద్రీనీవా కింద లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాలంటే ఒక్క ఎకరాకు కూడా నీరు అందించలేదన్నారు. ఇళ్ల స్థలాలు, ఇతర మౌలిక సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, సమస్యల పరిష్కారం కోసం వెళ్లిన ప్రజలకు అహంభావంతో సమాధానం చెప్పడంతో ప్రజల మన్నలను కోల్పోయాడన్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top