కాశీ యాత్రకులను వెనక్కు తీసుకువస్తాం

కరోనా కట్టడికి మూడు నెలల వేతనం సాయంగా ఇస్తున్నా

ఇరిగేషన్‌ శాఖ మంత్రి డాక్టర్‌ అనిల్‌కుమార్‌ యాదవ్‌

నెల్లూరు: కాశీలో చిక్కుకున్న నెల్లూరు యాత్రికులను వెనక్కు తీసుకువస్తామని ఇరిగేషన్‌ శాఖ మంత్రి డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ యాదవ్‌ చెప్పారు. యాత్రికులను ఏపీకి తీసుకువచ్చేందుకు జిల్లా ఎస్పీ భాస్కర్‌ అక్కడి అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారన్నారు. నెల్లూరులో మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ మీడియాతో మాట్లాడుతూ.. కరోనా కట్టడికి తన మూడు నెలల జీతాన్ని సాయంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. కరోనా కట్టడి కోసం అద్భుతంగా పనిచేస్తున్న అధికారులకు ఆయన అభినందనలు తెలిపారు. ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించాలని, ఇంటి నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. కరోనా కట్టడికి ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. 

అదేవిధంగా నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్, మున్సిపల్‌ కమిషనర్‌లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి డివిజన్, ప్రతి వార్డులలో రెండు సంచార కూరగాయల మార్కెట్ లను ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. అదేవిధంగా కరోనా నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించి పారిశుద్ధ్యం మెరుగు పరచడంతో పాటు వీధులలో ప్రత్యేకంగా స్ప్రేలు చేయించాలని అధికారులను ఆదేశించారు. 

తాజా వీడియోలు

Back to Top