"గ‌డ‌ప గ‌డ‌ప‌కు" పోటెత్తిన జ‌నం

ప్రభగిరిపట్నంలో మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డికి ఘ‌న స్వాగ‌తం 

నెల్లూరు:   ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల‌తో రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి నిర్వ‌హించిన గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మానికి స‌ర్వేపల్లి నియోజకవర్గంలో విశేష స్పంద‌న ల‌భిస్తోంది. పొదలకూరు మండలం ప్రభగిరిపట్నం సచివాలయ పరిధిలో ఉలవరపల్లి, ప్రభగిరిపట్నం గ్రామాల్లో మంత్రి "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా కాకాణికి స్థానికులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల‌తో తాము సంతృప్తిగా ఉన్నామ‌ని తెలిపారు.  అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించేందుకు "ఒక్క రూపాయి మంజూరు చేయించలేకపోయిన సోమిరెడ్డి" పనిగొట్టుకొని విమర్శలు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాడని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు. సోమిరెడ్డి హయాంలో శంకుస్థాపన శిలాఫలకాలు తప్ప, ప్రారంభోత్సవ శిలాఫలకాలు లేవన్నారు.  సోమిరెడ్డి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు నిధులు కేటాయించలేక పోయాడన్నారని  విమ‌ర్శించారు. ప్రభగిరిపట్నం గ్రామంలో నేను చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వలన ప్రజల్లో ఇంత పెద్ద ఎత్తున స్పందన రావడానికి కారణమ‌న్నారు.  గ్రామాల్లో ప్రతి గడపకు వెళ్లి, ప్రతి కుటుంబాన్ని పలకరిస్తూ, ప్రభుత్వ ద్వారా అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ఆరా తీయడంతో పాటు, అభివృద్ధి కార్యక్రమాలను తెలుసుకోవడమే అజెండాగా "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని  మంత్రి కాకాణి తెలిపారు. 

  రైతులకు సమగ్రంగా సాగునీరు అందించడంతో పాటు, ఎరువుల కొరత రానివ్వకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నామ‌ని మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి తెలిపారు.  తుఫానులు, భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న కాలువలను, చెరువులను యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి, రైతాంగానికి సాగునీరు అందించామ‌న్నారు.  రైతులకు సాగునీరు రైతు భరోసా, ఆ సీజన్ ముగిసే సరికి ఇన్ పుట్ సబ్సిడీ, వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులకు సబ్సిడీలో విత్తనాలు అందించామ‌ని తెలిపారు. నేడు గిట్టుబాటు ధర కంటే ఎక్కువగా రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకొని లాభపడుతున్నారు. తెలుగుదేశం నాయకులు రైతులు బాగుపడుతున్నారని కుమిలి, కుమిలి ఏడుస్తున్నార‌ని పేర్కొన్నారు. గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా వెలగబెట్టిన సోమిరెడ్డి, మిల్లర్ల దగ్గర ముడుపులు మింగి, రైతుల నడ్డి విరిచిన సంగతిని రైతులు ఎన్నటికీ మర్చిపోరని గుర్తు చేశారు.  చంద్రబాబు, తెలుగుదేశం నాయకులు వైయ‌స్ జ‌గ‌న్ గారి ప్రభుత్వంపై దిగజారుడు విమర్శలు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. "రైతులు బాగుంటే రాష్ట్రం బాగుపడుతుందన్న" ఆలోచన చేస్తున్న ప్రభుత్వం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి గారి ప్రభుత్వమ‌ని నొక్కి ఒక్కానించారు. పాలిచ్చేటువంటి పాడి బర్రెను వదులుకొని, మేతమేసే దున్నపోతును తెచ్చుకొని ఇంట్లో కట్టేసుకునే మూర్ఖులు ఎవరు ఉండరని తెలుగుదేశం నాయకులు తెలుసుకుంటే మంచిద‌ని హిత‌వు ప‌లికారు.  రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీని నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఈనాడు పత్రిక రాసే రాతలు చూస్తే పత్రికలకు విలువ లేకుండా పోతుంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశౄరు. 👉 రామోజీరావు చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని ఆలోచనతో, పిచ్చి, పిచ్చి రాతలు రాస్తున్నాడ‌ని త‌ప్పుప‌ట్టారు.  గతంలో పట్టాభి పై జరిగినటువంటి దాడికి సంబంధించిన ఫోటోలను నేడు జరిగినట్లు ప్రచురించి, కథనాలు రాసి ఈనాడు పత్రిక అబాసుపాలయ్యింద‌న్నారు. వైయ‌స్ఆర్‌సీపీ సోషల్ మీడియా రామోజీరావు బాగోతాన్ని పట్టబయలు చేసింద‌ని ప్ర‌శంసించారు.  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమమే  అజెండాగా పనిచేస్తుంద‌ని పేర్కొన్నారు.  

Back to Top