15వ ఆర్థిక సంఘం చైర్మన్‌ను కలిసిన ఎంపీ విజయసాయిరెడ్డి

న్యూఢిల్లీ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి 15వ ఆర్థిక సంఘం చైర్మన్‌ ఎన్‌కే సింగ్‌ను కలిశారు. ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు రావాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ తరఫున ఎన్‌కే సింగ్‌కు విజయసాయిరెడ్డి ఆహ్వానం పలికారు. సీఎం వైయస్‌ జగన్‌ రాసిన లేఖన్‌ ఆర్థిక సంఘం చైర్మన్‌కు అందజేశారు. సీఎం వైయస్‌ జగన్‌ ఆహ్వానంపై ఎన్‌కే సింగ్‌ సానుకూలంగా స్పందించినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. ఏపీ పర్యటనకు వస్తానని పేర్కొనట్లు చెప్పారు. 

Back to Top