ముమ్మరంగా విజయ సంకల్ప స్థూపం నిర్మాణ పనులు

శ్రీకాకుళం: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర చివరి దశకు చేరింది. పాదయాత్ర ముగింపు సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో నిర్మిస్తున్న విజయ సంకల్ప స్థూపం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈ నెల 9వ తేదీ వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఈ స్థూపాన్ని ఆవిష్కరించనున్నారు.

ఈ మేరకు గురువారం స్థూపం నిర్మాణ పనులను వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు భూమన కరుణాకర్‌రెడ్డి, తలశీల రఘురాం తదితరులు పరిశీలించారు. 

 

Back to Top