విశాఖ: తెలంగాణ ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశ పెట్టడంపై వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో.. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఇంగ్లిష్ మీడియాన్ని అమలు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ నిర్ణయాన్ని వివరిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబుపై విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఇంగ్లిష్ మీడియం అమలు విధివిధానాలపై తెలంగాణ ప్రభుత్వం మంత్రి వర్గ ఉపసంఘాన్ని నియమించిందని, తన పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివిస్తూ పేద పిల్లలకు ఆ అవకాశాన్ని ఇవ్వొద్దని ఏడుస్తున్న బాబు గ్యాంగ్ ఎలా స్పందిస్తుందోనంటూ వ్యాఖ్యానించారు. కాగా, గత ఏడాది ఏపీ ప్రభుత్వం కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆ నిర్ణయంపై టీడీపీ, ఇతర ప్రతిపక్షాలు విమర్శలు చేయడాన్ని విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా తిప్పికొట్టారు. ఎరువులపై సబ్సీడీకి కేటాయింపులు రెట్టింపు ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్ళు, చీడపీడలతో పోరాటం చేస్తూ సాగును కొనసాగిస్తున్న రైతాంగానికి పెరిగిన ఎరువుల ధరలు ఆశనిపాతంగా మారాయి. ఎరువుల ధరల భారం నుంచి రైతాంగానికి ఉపశమనం కలిగించేందుకు వచ్చే బడ్జెట్లో ఎరువులపై సబ్సీడీకి కేటాయింపులు రెట్టింపు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా మనవి. బాబుకు కరోనా సోకటం బాధాకరం యాదృచ్ఛికమే అయినా, ఎన్టీఆర్ వర్థంతినాడు చంద్రబాబుకు కరోనా సోకటం బాధాకరం. బాబుకు వచ్చిన కరోనా తగ్గిపోతుందిగానీ, టీడీపీ వ్యవస్థాపకుడికి బాబు పొడిచిన వెన్నుపోటు మాత్రం తెలుగుజాతి ఉన్నంత వరకు గుర్తుంటుందని మరో ట్విట్‌లో విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.