వేంపల్లి ఓటర్లు భయపడకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి 

 టీడీపీ రౌడీల భయానికి తలొగ్గొద్దు.. ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత ఓటర్లదే 

వైయస్‌ఆర్‌ జిల్లా: వేంపల్లిలో టీడీపీ అరాచక శక్తులకు భయపడకుండా ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

వేంపల్లిపై దండయాత్రకు బయటి ప్రాంతాల నుంచి టీడీపీ రౌడీలను తరలిస్తున్నారని, పోలీసులను అడ్డం పెట్టుకుని ఓటర్లలో భయాందోళనలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సతీష్‌రెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి బెదిరింపులకు ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

అరాచక శక్తులకు తలొగ్గకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఓటరుపైనా ఉందని సతీష్‌రెడ్డి అన్నారు. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా పోలింగ్‌ కేంద్రాలకు చేరుకుని తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయాలని వేంపల్లి ప్రజలను కోరారు. టీడీపీ మూకల బెదిరింపులు, పోలీసుల ఒత్తిళ్లతో ప్రజాస్వామ్య హక్కును హరించేందుకు చేసే ప్రయత్నాలను ప్రజలే తిప్పికొట్టాలని సతీష్‌రెడ్డి పిలుపునిచ్చారు.

Back to Top