శ్రీకాళహస్తిలో కూటమి దౌర్జన్యకాండ

ఇండిపెండెంట్ చైర్మన్ అభ్యర్థిపై హత్యాయత్నం 

తిరుపతి జిల్లా: శ్రీకాళహస్తి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో స్వతంత్ర చైర్మన్ అభ్యర్థి పాండురంగ అలియాస్ పాండుపై హత్యాయత్నం జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది. రాజీవ్ నగర్ వద్ద పాండురంగను కారుతో ఢీకొట్టి చంపేందుకు ప్రయత్నించారని వైయ‌స్ఆర్‌సీపీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పాండురంగ ప్రాణాపాయస్థితిలో ఉన్నట్లు తెలిపారు.

సంఘటన సమాచారం అందుకున్న మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి వెంటనే అక్కడికి చేరుకుని గాయపడిన పాండురంగను ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.

శ్రీకాళహస్తిలో గతంలో ఎన్నడూ హత్యా రాజకీయాలకు తావు లేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ ప్రత్యర్థులపై దాడులు, హత్యా రాజకీయాలను ప్రోత్సహించే పరిస్థితులు ఏర్పడ్డాయని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థిపై జరిగిన దాడిపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రక్రియను భయానక వాతావరణంలోకి నెట్టే ప్రయత్నాలను అడ్డుకోవాలని కోరారు.

Back to Top