వేల్పుల గ్రామ సచివాలయ కాంప్లెక్స్‌ ప్రారంభించిన సీఎం

ఒకే ప్రాంగ‌ణంలో నిర్మించిన ఆరు ప్ర‌భుత్వ భ‌వ‌నాల‌ను ప్రారంభించిన వైయ‌స్ జ‌గ‌న్‌

వైయస్‌ఆర్‌ జిల్లా: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైయస్‌ఆర్‌ జిల్లా చేరుకున్నారు. సీఎం వైయస్‌ జగన్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. కడప ఎయిర్‌పోర్టు నుంచి వేముల మండలంలోని వేల్పుల గ్రామానికి చేరుకున్న సీఎం వైయస్ జగన్‌కు చిరుజ‌ల్లులు స్వాగ‌తం ప‌లికాయి. వేల్పులలో నూత‌నంగా నిర్మించిన‌ గ్రామ సచివాలయ కాంప్లెక్స్‌ను ముఖ్య‌మంత్రి ప్రారంభించారు. ఒకే ప్రాంగణంలో నిర్మించిన ఆరు ప్ర‌భుత్వ కార్యాల‌య భవనాలకు సీఎం వైయస్‌ జగన్‌ రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు. 

గ్రామ సచివాలయం, బ్రాంచ్‌ తపాలా కార్యాలయం, వైయస్‌ఆర్‌ విలేజ్‌ క్లినిక్, వైయస్‌ఆర్‌ రైతు భరోసా కేంద్రం, వైయస్‌ఆర్‌ డిజిటల్‌ లైబ్రరీ, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి కేంద్రం భవనాలను సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభించారు. భవన నిర్మాణాలను పరిశీలించిన అనంతరం అక్కడున్న సిబ్బందితో సీఎం వైయస్‌ జగన్‌ ముచ్చటించారు. స‌చివాల‌య కాంప్లెక్స్ ఆవ‌ర‌ణ‌లో ఏర్పాటు చేసిన జాతిపిత మ‌హాత్మా గాంధీ, దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్ర‌హాల‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆవిష్క‌రించారు. పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు.
 

Back to Top