విజయవాడ: విజయవాడ నగరంలో కోవిడ్ కేసులు పెరుగుదలపై,కరోనా వ్యాప్తి నియంత్రణపై దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఎమ్.విష్ణు ,జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24గంటల్లో మరో 81 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క కృష్ణా జిల్లాలోనే 52 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికారులను మంత్రి అప్రమత్తం చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1097కి చేరింది. ఈ వైరస్ నుంచి ఇప్పటివరకు 231 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా, 31 మంది ప్రాణాలు కోల్పొయారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 835గా ఉంది.