విజయవాడ: కూటమి ప్రభుత్వ వైఫల్యం వల్లే విజయవాడ నగరం మునిగిపోయిందని వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయవాడ నగరం అతలాకుతలమైంది, ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. కూటమి ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది, ఇంత జరుగుతుంటే ఈ రోజు మంత్రి నారాయణ, లోకేష్ హడావిడి చేస్తున్నారు. తక్షణ చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ ఈస్ట్ వైయస్‌ఆర్‌సీపీ ఇంఛార్జి దేవినేని అవినాష్ మీడియాతో మాట్లాడారు. వెల్లంపల్లి శ్రీనివాస్ ఏమన్నారంటే.. విజయవాడ నగరమంతా నీట మునిగి పునరావాస చర్యలు లేవు, వాతావరణ శాఖ హెచ్చరించినా ప్రభుత్వం స్పందించలేదు, నిన్న కొండచరియలు విరిగిపడి ఐదుగురు చనిపోయారు, వారిని పరామర్శించిన వారు లేరు. కరెంట్ లేదు, నిత్యావసర వస్తువులు లేవు, ఇదేనా పాలన, విజయవాడ నగరంలో మీ కూటమి ఎంపీ, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు. ప్రజలు మాకు ఫోన్లు చేసి సాయం కోరుతున్నారు, మేం అంతా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాం, అధికార్లు కూడా మా ఫోన్‌లు ఎత్తడం లేదు, గతంలో సచివాలయ వ్యవస్ధ, వలంటీర్ వ్యవస్ధ ఉంటే ముందే ప్రజలను అప్రమత్తం చేసేవారు, కానీ ఇప్పుడు ఆ వ్యవస్ధలు లేవు, జగన్ గారు రిటైనింగ్ వాల్ కట్టడం వల్ల క్రిష్ణలంక వాసులు ప్రశాంతంగా ఉన్నారు, సుజనా చౌదరి, బోండా ఉమా, గద్దే రామ్మోహన్, కేశినేని చిన్నీ ఎక్కడున్నారు. చంద్రబాబు గారు మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు, మీరంతా వీకెండ్స్ ఎంజాయ్ చేస్తున్నారా, డిప్యూటీ సీఎంగారు ఎక్కడున్నారు, విజయవాడ నగరం నాశనమవుతోంది, దయచేసి కాపాడండి, ప్రజల ఆకలి తీర్చండి, వారికి నష్టపరిహారం చెల్లించండి, కూటమి ప్రభుత్వం స్పందించకపోతే తప్పకుండా మేం ప్రజల తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తాం, బాధితులకు అండగా ఉంటాం మల్లాది విష్ణు, మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. తుపాను వల్ల ఏఏ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ఉంటుందో వాతావరణ శాఖ హెచ్చరించింది, దీనిపై సీఎం, సంబంధిత శాఖల మంత్రులు వెంటనే స్పందించి ఉంటే ఈ పరిస్ధితి వచ్చేదా, గతంలో జగన్ గారు ఇలాంటి పరిస్ధితి వస్తే వెంటనే అలెర్ట్ అయి ముందస్తు చర్యలు తీసుకునేవారు. ఇప్పుడా పరిస్ధితి లేదు, ప్రభుత్వ సహాయక చర్యల్లో పూర్తిగా విఫలం చెందారు, ఇరిగేషన్ అధికారులు అంచనా వేయడంలో ఫెయిల్ అయ్యారు, లక్షల క్యూసెక్కుల వరద వస్తే ఏ చర్యలు తీసుకోవాలో ముందుగా మీకు తెలీదా, క్యాచ్‌మెంట్ ఏరియాలో వరదలు వస్తే లోతట్టు ప్రాంతాలు మునిగిపోతాయని తెలీదా, వాటర్ మేనేజ్‌మెంట్‌లో ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ దుస్ధితి నెలకొంది. ప్రభుత్వం పూర్తిగా నిద్రావస్ధలో ఉంది, పవన్‌కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, ఒక్క రివ్యూ చేశారా, మీకు అధికారం ఇస్తే మీరేం చేస్తున్నారు, లక్షలాదిమంది జనాభా నీటిలో ఉండి ఆకలితో అలమటిస్తున్నారు, ఇరిగేషన్ మంత్రి, అధికారులు నిద్రపోతున్నారా, విజయవాడ నగరమంతా మీకు ఓట్లేసి గెలిపిస్తే ఇలాగా వ్యవహరించేది, తక్షణం ప్రభుత్వం చర్యలు ప్రారంభించాలి, చుట్టపు చూపు పర్యటనలు వద్దు, ముందస్తు చర్యలు తీసుకోవడంలో ఫెయిలయినవారిపై చర్యలు తీసుకోవాలి. అన్ని ప్రభుత్వ శాఖలు నిర్లిప్తంగా ఉన్నాయి, అంతా వైఫల్యం చెందారు, చంద్రబాబు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు, ఇదేనా మరి మీ అనుభవం, కూటమి నేతలంతా హాలిడేస్ ఎంజాయ్ చేస్తూ ప్రజలను గాలికొదిలేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఎలాంటి చర్యలు తీసుకున్నామో ప్రజలను అడగండి, 48 గంటల్లో వారికి నష్టపరిహారం ఇచ్చాం, ఇప్పుడు మాత్రం అలాంటి చర్యలేమీ కనిపించడం లేదు, కూటమి ప్రభుత్వం తక్షణం యుద్దప్రాతిపదికన సహాయక చర్యలు తీసుకుని ప్రజలకు అండగా నిలబడాలి. లేనిపక్షంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున పోరాడుతుంది. దేవినేని అవినాష్, విజయవాడ ఈస్ట్ వైఎస్‌ఆర్‌సీపీ ఇంఛార్జి విజయవాడ నగరం మొత్తం జలమయమైంది, తూర్పునియోజకవర్గంలో కొండ చరియలు విరిగిపడి చనిపోయారు, గతంలో జగన్ గారి ప్రభుత్వంలో ప్రభుత్వ యంత్రాంగమంతా స్పందించి కావాల్సిన సదుపాయాలు కల్పించింది, కానీ ఈరోజు వాతావరణ శాఖ ముందుగానే ప్రకటించినా ఏ ఒక్క అధికారి అయినా స్పందించారా, మేం అంతా మా నాయకుడు వైఎస్ జగన్ ఆదేశాలతో ప్రజల వద్దకు వెళ్ళాం, కానీ ఒక్క అధికారి కూడా రాలేదు, గతంలో మేం గంటల వ్యవధిలో మోటర్లు పెట్టి నీరు తోడేసేవాళ్ళం, ఇప్పుడు ఆ పరిస్ధితి లేదు, జగన్ గారి ముందుచూపు వల్ల క్రిష్ణలంక వాసులంతా సురక్షితంగా ఉన్నారు, ఇప్పుడు ప్రజలంతా అనుకుంటున్నారు, మేం కూటమి ప్రభుత్వానికి ఓటు వేసి తప్పు చేశామంటున్నారు, ఒక్క ఎమ్మెల్యే స్పందించడం లేదని జనం గగ్గోలు పెడుతున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వీకెండ్ సరదాలతో బిజీగా ఉన్నారు, తప్ప ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదు. మా వైఎస్‌ఆర్‌సీపీ క్యాడర్, నాయకులు అంతా ప్రజలకు అందుబాటులో ఉన్నాం, మృతిచెందిన వారి కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.