ర‌మ్య హ‌త్య కేసును టీడీపీ రాజ‌కీయం చేస్తోంది

మహిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్ వాసిరెడ్డి ప‌ద్మ‌

గుంటూరు:  బీటెక్ విద్యార్థిని ర‌మ్య హ‌త్య కేసును టీడీపీ రాజ‌కీయం చేస్తుంద‌ని ఏపీ మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్ వాసిరెడ్డి ప‌ద్మ మండిప‌డ్డారు. ర‌మ్యను హ‌త్య చేసిన నిందితుడిని వెంట‌నే పోలీసులు అరెస్టు చేశార‌ని, రాజ‌కీయ ల‌బ్ధి కోసం టీడీపీ ప్ర‌య‌త్నించ‌డం సిగ్గు చేటు అన్నారు. మ‌హిళ‌ల ర‌క్ష‌ణ‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దిశ చ‌ట్టాన్ని తీసుకువ‌చ్చార‌న్నారు. ఆడ‌పిల్ల‌ల‌కు అన్యాయం జ‌రిగితే టీడీపీ నేత‌లు ఎప్పుడైనా ప‌ట్టించుకున్నారా? అని నిల‌దీశారు.  టీడీపీ నేత నారా లోకేష్ ఏం మాట్లాడుతున్నారో ఆయన‌కే అర్థం కావ‌డం లేదని వాసిరెడ్డి ప‌ద్మ ఎద్దేవా చేశారు.

Back to Top