ఘ‌నంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు

క‌ర్నూలు: వాల్మీకి జయంతి వేడుక‌లు కర్నూలు నగరంలో పలుచోట్ల ఘ‌నంగా నిర్వ‌హించారు. జయంతి వేడుకలకు  వైయస్ఆర్ సిపి కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు, కర్నూలు నగర పాలక సంస్థ మేయర్ బి.వై రామయ్య పాల్గొని వాల్మీకి చిత్ర ప‌టానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. న‌గ‌రంలోని 19వ వార్డులోని గణేష్ నగర్లో మేయర్ బి.వై రామయ్య  అధ్యక్షతన ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో వీరలింగాయత్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎన్.గోపాల్ రెడ్డి, నాయకులు రాజేంద్రప్రసాద్, బైరేష్, వెంకీ పాల్గొన్నారు.  

వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో:
 వైయస్ఆర్ సిపి కర్నూలు జిల్లా కార్యాలయంలో  వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు, మేయర్ బి.వై రామయ్య  అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎల్లమ్మ టెంపుల్ చైర్మన్ బేతం కృష్ణుడు, నాయకులు సుభాష్, సత్యం, రాజేంద్ర ప్రసాద్, ధనుంజయ ఆచారి, శ్రీను, యూనూస్, తదితరులు పాల్గొన్నారు.

అధికారికంగా: ప్రభుత్వం తరపున ఆదికవి మహర్షి వాల్మీకి జయంతోత్సవం కలేక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో జిల్లా బి.సి కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కలెక్టర్ కోటేశ్వరరావు , మేయర్ బి.వై రామయ్య , ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి  , జెసి-2 శ్రీనువాసులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ముందుగా కృష్ణదేవరాయల సర్కిల్ నందు ఉన్న వాల్మీకి మహర్షి విగ్రహానికి అధికారికంగా పూలమాలలు వేశారు.

ఈ సందర్భంగా మేయర్ బి.వై రామయ్య  మాట్లాడుతూ.. ఎస్టి సాధన కోసం మా వంతు ప్రయత్నాలు ఎప్పుడూ జరుగుతూనే ఉన్నాయని, త్వరలోనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు.జిల్లా కేంద్రంలో వాల్మీకి భవన్ నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని, అందుకు స్థలం దొరికితే నిర్మించి తీరుతామన్నారు.వచ్చే సంవత్సరం వాల్మీకి జయంతి కర్నూలులోనే నిర్వహిస్తామన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top