కేంద్ర మంత్రి అమిత్ షాకు శ్రీ‌శైలంలో ఘ‌న స్వాగ‌తం  

 
స్వాగ‌తం ప‌లికిన  రాష్ట్ర మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌

కర్నూలు: కేంద్ర హోంమంత్రి అమిత్ షా శ్రీశైలం మల్లన్న స్వామివారిని గురువారం దర్శించుకున్నారు. ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు చేరుకున్న కేంద్ర హోంమంత్రి  అమిత్ షా.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో సున్నిపెంట చేరుకున్నారు. అమిత్‌ షాకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఎంపీ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, కలెక్టర్‌, అధికారులు ఘన స్వాగతం పలికారు.

అక్కడ నుంచి అమిత్‌ షా రోడ్డు మార్గం ద్వారా శ్రీశైలం చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. భ్రమరాంబ అతిథిగృహంలో అమిత్ షా మధ్యాహ్న భోజనం చేయనున్నారు. మధ్యాహ్నం 3.50 గంటలకు అమిత్ షా హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు.

Back to Top