తాడేపల్లి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ-2025లో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయంటూ నిరుద్యోగ యువత, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసిన అభ్యర్థుల ఆశలను ప్రభుత్వం దెబ్బతీసిందని ఆరోపిస్తూ వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. జిల్లా కేంద్రాలు, ఆర్డీవో కార్యాలయాలు, కలెక్టరేట్ల వద్ద నిరుద్యోగులు, విద్యార్థులు, పార్టీ నేతలు పెద్దఎత్తున ఆందోళనలకు దిగారు. డీఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా దుర్వినియోగం, అర్హతలేని వారికి ఉద్యోగాల కేటాయింపు, పేపర్ లీకేజీ ఆరోపణలు, ఫేక్ సర్టిఫికెట్లతో ఎంపికలు జరిగిన అంశాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీ పేరుతో ప్రభుత్వం యువత భవిష్యత్తుతో చెలగాటమాడిందని మండిపడిన నిరసనకారులు.. మొత్తం వ్యవహారంపై సీబీఐతో నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గుంటూరు: మెగా డీఎస్సీ-2025లో జరిగిన అక్రమాలకు నిరసనగా గుంటూరులో వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. వాటర్ ట్యాంకుల సెంటర్ నుంచి లాడ్జి సెంటర్ వరకు జరిగిన ఈ ర్యాలీలో విద్యార్థులు, నిరుద్యోగ యువత, పార్టీ నాయకులు పెద్దఎత్తున పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లాడ్జి సెంటర్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించిన నాయకులు.. డీఎస్సీ నియామకాలలో జరిగిన అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగ అధ్యక్షుడు పానుగంటి చైతన్య, మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, చంద్రగిరి రత్నం, అంబటి మురళీకృష్ణ, నూరి ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. - డీఎస్సీ అక్రమాల పుట్ట: వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ యువతను మోసం చేశారని వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య విమర్శించారు. ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ అక్రమాల పుట్టగా మారిందని, పరీక్షల నిర్వహణ పూర్తిగా గందరగోళంగా సాగిందని ఆరోపించారు. డీఎస్సీలో జరిగిన అవకతవకలపై వెంటనే సీబీఐతో విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. - దగా డీఎస్సీ: మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రభుత్వం నిర్వహించింది మెగా డీఎస్సీ కాదని, దగా డీఎస్సీ అని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. పరీక్షలు నిర్వహించే వారే డీఎస్సీ పరీక్షలు రాయడం ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. స్పోర్ట్స్ సర్టిఫికెట్ల పేరుతో భారీ స్థాయిలో డబ్బులు వసూలు చేసి ఉద్యోగాలు అమ్ముకున్నారని ఆరోపించారు. స్పోర్ట్స్ కోటా కింద ఉన్న పోస్టులను లోకేష్ అమ్ముకున్నారని, ఆయనకు సిగ్గు ఉంటే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. దేశంలో చంద్రబాబు నాయుడు లాంటి దరిద్రపు ప్రభుత్వం ఎక్కడా లేదని విమర్శించారు. యువత జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలు, అవకతవకలపై వెంటనే సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కర్నూలు: మెగా డీఎస్సీ-2025లో జరిగిన అక్రమాలకు నిరసనగా కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ధర్నా నిర్వహించారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత, పార్టీ నాయకులు పెద్దఎత్తున పాల్గొని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. “మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ”, “నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలి” అంటూ ఆందోళనకారులు ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ నియామకాల ప్రక్రియలో నిజమైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని, మెరిట్‌ను పక్కనపెట్టి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. స్పోర్ట్స్ కోటా దుర్వినియోగం, ఫేక్ సర్టిఫికెట్లు, పేపర్ లీకేజీలు, డబ్బులు తీసుకుని ఉద్యోగాలు కట్టబెట్టారనే ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అర్హులైన నిరుద్యోగులను మోసం చేసిందని మండిపడ్డారు. మెగా డీఎస్సీలో దగా మపడ్డ అభ్యర్థులకు వైయస్ఆర్‌సీపీ అండగా ఉంటుందని పార్టీ నేతలు హామీ ఇచ్చారు. విద్యార్థులు, నిరుద్యోగుల హక్కుల కోసం చివరి వరకు పోరాడతామని స్పష్టం చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేసి, మొత్తం డీఎస్సీ వ్యవహారంపై సీబీఐతో నిష్పక్షపాత విచారణ జరిపించాలని వైయస్ఆర్‌సీపీ నేతలు డిమాండ్ చేశారు. - యువత భవిష్యత్తుతో ఆటలా?: ఎమ్మెల్యే విరూపాక్షి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పాలన ప్రజావ్యతిరేకంగా మారిందని, మెగా డీఎస్సీని దగా డీఎస్సీగా మార్చి లక్షలాది నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ఆటలాడుతున్నారని ఎమ్మెల్యే వీరుపాక్షి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మెగా డీఎస్సీ-2025లో భారీ స్థాయిలో అవినీతి, అక్రమాలు జరిగాయని ఆరోపించారు. అర్హత, మెరిట్ ఉన్న అభ్యర్థుల పేర్లను కావాలనే తప్పించి, డబ్బులు ఇచ్చిన వారికి ప్రాధాన్యం కల్పించారనే ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా వినిపిస్తున్నాయని అన్నారు. విద్యాశాఖలో చోటుచేసుకున్న ఈ అవినీతి వ్యవహారానికి పూర్తి బాధ్యత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌దేనని, వెంటనే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ నియామకాల ప్రక్రియలో స్పోర్ట్స్ కోటా దుర్వినియోగం, పేపర్ లీకేజీలు, ఫేక్ సర్టిఫికెట్లతో ఎంపికలు జరిగిన విషయాలు వెలుగులోకి వస్తున్నప్పటికీ ప్రభుత్వం నిజాలను దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. డీఎస్సీలో జరిగిన అన్యాయంపై ప్రశ్నిస్తున్న నిరుద్యోగులపై కేసులు పెట్టడం దారుణమని, ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి కష్టపడిన యువతను ప్రభుత్వం వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం డీఎస్సీ వ్యవహారంపై సీబీఐతో సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వీరుపాక్షి డిమాండ్ చేశారు. - యువతకు న్యాయం చేయాలి: కేకే రాజు మెగా డీఎస్సీ-2025లో జరిగిన అక్రమాలపై విశాఖ జిల్లాలో వైయస్ఆర్‌సీపీ పోరుబాట చేపట్టింది. డీఎస్సీ నియామకాలలో భారీ అవినీతి, అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ శుక్రవారం విశాఖలో పార్టీ శ్రేణులు ఆందోళన కార్యక్రమం నిర్వహించాయి. డాబా గార్డెన్స్‌లోని అంబేద్కర్ కూడలిలో జరిగిన నిరసనలో పార్టీ నాయకులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు, నిరుద్యోగ యువత పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన నాయకులు.. రాజ్యాంగబద్ధంగా యువతకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డీఎస్సీ నియామకాలలో స్పోర్ట్స్ కోటా దుర్వినియోగం, అర్హులైన అభ్యర్థులకు అన్యాయం, పేపర్ లీకేజీలు, ఫేక్ సర్టిఫికెట్లతో ఎంపికలు జరిగిన అంశాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు కేకే రాజు, ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, కుంభ రవి బాబు తదితరులు పాల్గొని ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగ యువత ఆశలను ప్రభుత్వం ఛిన్నాభిన్నం చేసిందని మండిపడిన నేతలు.. మొత్తం వ్యవహారంపై సీబీఐతో నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. - పరిపాలనా వైఫల్యాల వల్ల యువతకు తీవ్ర నష్టం: మాజీ మంత్రి కాకాణి మెగా డీఎస్సీ-2025లో జరిగిన అవకతవకలపై వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం నెల్లూరు జిల్లాలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. నెల్లూరులోని విఆర్సీ సెంటర్ వద్ద శుక్రవారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో విద్యార్థులు, నిరుద్యోగ యువత, పార్టీ నేతలు పెద్దఎత్తున పాల్గొన్నారు. డీఎస్సీ పరీక్షల నిర్వహణలో పారదర్శకత లేకపోవడం, అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నియామక ప్రక్రియలో మెరిట్‌ను పక్కనపెట్టి అక్రమాలకు పాల్పడ్డారని, స్పోర్ట్స్ కోటా దుర్వినియోగం, ఫేక్ సర్టిఫికెట్లతో ఎంపికలు, పేపర్ లీకేజీ వంటి అంశాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నిరసనలో పాల్గొన్న మాజీ మంత్రి కాకాణి వెంకటరత్నం మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ పరిపాలనా వైఫల్యాల వల్ల నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోయిందని మండిపడ్డారు. ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి కష్టపడిన అభ్యర్థుల భవిష్యత్తును ప్రభుత్వం చీకటిలోకి నెట్టిందని విమర్శించారు. - లోకేష్ రాజీనామా చేయాలి: మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి మెగా డీఎస్సీ-2025లో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి డిమాండ్ చేశారు. ఎస్వీ యూనివర్సిటీ ఎదుట వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. డీఎస్సీ నియామకాలలో భారీ స్థాయిలో అవినీతి చోటుచేసుకుందని ఆరోపించారు. ఒక్కో ఉద్యోగాన్ని రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు అమ్ముకున్నారనే ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా వినిపిస్తున్నాయని అన్నారు. ఓసీ ఓపెన్ కేటగిరి కటాఫ్‌ను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా బయట పెట్టడం లేదని, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని భూమన ఆరోపించారు. రిజర్వేషన్ వర్గాలకు చెందిన విద్యార్థులు మెరిట్‌లో వచ్చినప్పటికీ, వారిని ఓపెన్ కేటగిరిలో పరిగణించకుండా కేవలం రిజర్వేషన్ కోటాలోనే ఎంపిక చేసి అవకాశాలు కుదించారని విమర్శించారు. ఓపెన్ కేటగిరి కటాఫ్ వివరాలను వెంటనే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.స్పోర్ట్స్ కోటాలో అదనపు కోటా కలిపి అర్హతలేని వారికి ఉద్యోగాలు కట్టబెట్టారని, ఇందులో శాప్ చైర్మన్ రవినాయుడు పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. సుమారు 3.50 లక్షల మంది అభ్యర్థులు డీఎస్సీ పరీక్షలు రాసినా, ప్రభుత్వం తమకు అనుకూలమైన వారికి మాత్రమే ఉద్యోగాలు కట్టబెట్టిందని మండిపడ్డారు. మొత్తం డీఎస్సీ వ్యవహారంపై సీబీఐతో సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భూమన కరుణాకరరెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ.. సకల శాఖల మంత్రిగా వ్యవహరిస్తున్న నారా లోకేష్ భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. డీఎస్సీ నియామకాలలో జరిగిన అవకతవకలపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని, మంత్రి లోకేష్ తన పదవికి రాజీనామా చేసి విచారణను ఎదుర్కోవాలని డిమాండ్ చేశారు. అనకాపల్లి: మెగా డీఎస్సీ-2025లో జరిగిన అవకతవకలకు నిరసనగా అనకాపల్లి నియోజకవర్గంలో వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ పిలుపుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, నిరుద్యోగ యువత, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనకాపల్లిలోని పార్టీ కార్యాలయం నుంచి రైల్వే స్టేషన్ రోడ్డులో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించిన కార్యకర్తలు.. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. డీఎస్సీ నియామకాలలో జరిగిన అక్రమాలు, అవకతవకలు, నిరుద్యోగ యువతకు జరిగిన అన్యాయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ “దగా డీఎస్సీ”కి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి అనకాపల్లి జిల్లా స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడు బొడ్డపల్లి హేమంత్ కుమార్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు, పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువత ఆశలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. డీఎస్సీ నియామకాల ప్రక్రియలో పారదర్శకత పూర్తిగా లోపించిందని, అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. విద్యార్థులు, నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు వైయస్ఆర్‌సీపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. శ్రీకాకుళం: మెగా డీఎస్సీ-2025లో జరిగిన అవకతవకలకు నిరసనగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. డీఎస్సీ పరీక్షల నిర్వహణ, అభ్యర్థుల ఎంపికలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ విద్యార్థులు, నిరుద్యోగ యువత, పార్టీ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, రాష్ట్ర వెలమ విభాగం అధ్యక్షుడు అంబటి శ్రీనివాస్, నియోజకవర్గ పరిశీలకులు అందవరపు సూరిబాబు, రాష్ట్ర యూత్ ఉపాధ్యక్షుడు మెంటాడ స్వరూప్, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు ముత్త విజయ్ కుమార్, జిల్లా యూత్ అధ్యక్షుడు మార్పు పృధ్విరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తిగా గందరగోళంగా మారిందని విమర్శించారు. అర్హత, మెరిట్ ఉన్న అభ్యర్థులకు అన్యాయం చేసి, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. స్పోర్ట్స్ కోటా దుర్వినియోగం, ఫేక్ సర్టిఫికెట్లు, పేపర్ లీకేజీ వంటి అంశాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని మండిపడిన నేతలు.. మొత్తం డీఎస్సీ వ్యవహారంపై సీబీఐతో నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు వైయస్ఆర్‌సీపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అమలాపురం: మెగా డీఎస్సీ-2025లో జరిగిన అవకతవకలకు నిరసనగా డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆదేశాల మేరకు, జిల్లా పార్టీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి సూచనలతో జిల్లా విద్యార్థి విభాగ అధ్యక్షుడు మిడుగుదిటి శిరీష్ నాయకత్వంలో అమలాపురం ఈదరపల్లి వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం షర్ట్లు లేకుండా నిరసన చేపట్టి ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “మెగా డీఎస్సీ కాదు.. మెగా స్కామ్”, “ఇదా మీ మెగా డీఎస్సీ?.. నిరుద్యోగుల జీవితాలతో దగా డీఎస్సీ”, “D for Deception.. S for Suitcase.. C for Collection” అంటూ నినాదాలు చేస్తూ విద్యార్థి నాయకులు నిరసన తెలిపారు. పేపర్ లీకులు, డేటా డిలీషన్లు, మెరిట్ లిస్టులు బయట పెట్టకపోవడం వంటి అంశాలు డీఎస్సీ నియామకాలపై అనుమానాలకు తావిస్తున్నాయని ఆరోపించారు. అర్హత ఉన్న అభ్యర్థులకు అన్యాయం చేసి, అక్రమార్కులకు ఉద్యోగాలు కట్టబెట్టారని మండిపడ్డారు. డీఎస్సీ నియామక ప్రక్రియలో పారదర్శకత పూర్తిగా లోపించిందని, నిరుద్యోగ యువత జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని వైయస్ఆర్‌సీపీ నేతలు విమర్శించారు. మొత్తం డీఎస్సీ వ్యవహారంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యార్థి విభాగ నాయకులు, పార్టీ కార్యకర్తలు, నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నంద్యాల: మెగా డీఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతను మోసం చేసిందని ఆరోపిస్తూ వైయస్ఆర్‌సీపీ స్టూడెంట్ విభాగం ఆధ్వర్యంలో నంద్యాలలో శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. డీఎస్సీ నియామకాలలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ పార్లమెంటరీ కమిటీ కార్యదర్శి, నంద్యాల అసెంబ్లీ పరిశీలకుడు సద్దల సూర్యనారాయణరెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మద్దూరు సుమంత్ రెడ్డి, యూత్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి పెసరవయి శ్రీకాంత్ రెడ్డి, స్టూడెంట్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మణిరెడ్డి, స్టూడెంట్ విభాగం జిల్లా అధ్యక్షుడు సురేష్, యూత్ విభాగం జిల్లా అధ్యక్షుడు గుండం నాగేశ్వర రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సద్దల శ్రీనివాసరెడ్డి, యూత్ వింగ్ జనరల్ సెక్రటరీ సద్దల చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా ట్రెజరర్ మదన్మోహన్ రెడ్డి, స్టూడెంట్ వింగ్ జిల్లా ఉపాధ్యక్షుడు నందివర్గం శేఖర్ రెడ్డి, పాణ్యం మండల యూత్ అధ్యక్షుడు సద్దల సుజిత్ రెడ్డి, ఆర్వీఎఫ్ రాజు నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. డీఎస్సీ నియామకాల ప్రక్రియలో పారదర్శకత పూర్తిగా లోపించిందని విమర్శించారు. మెరిట్ ఉన్న నిరుద్యోగ అభ్యర్థులకు అన్యాయం చేసి, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. స్పోర్ట్స్ కోటా దుర్వినియోగం, పేపర్ లీకేజీలు, ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు కట్టబెట్టారనే ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి కష్టపడిన నిరుద్యోగ యువత ఆశలను ప్రభుత్వం ఛిన్నాభిన్నం చేసిందని మండిపడిన వైయస్ఆర్‌సీపీ నేతలు.. మొత్తం డీఎస్సీ వ్యవహారంపై సీబీఐతో నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒంగోలు: మెగా డీఎస్సీ-2025లో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఒంగోలులో వైయస్ఆర్‌సీపీ నాయకులు అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. డీఎస్సీ నియామకాల ప్రక్రియలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ప్రభుత్వం వెంటనే సీబీఐతో దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో దర్శి ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు ఇన్‌చార్జి చుండూరు రవి తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం నాయకులు ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. డీఎస్సీ నియామకాలలో పారదర్శకత పూర్తిగా లోపించిందని, మెరిట్ ఉన్న అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. స్పోర్ట్స్ కోటా దుర్వినియోగం, పేపర్ లీకేజీలు, ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు కట్టబెట్టారనే ఆరోపణలు వెలుగులోకి వస్తున్నప్పటికీ ప్రభుత్వం నిజాలను దాచిపెట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి కష్టపడిన నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని విమర్శించిన వైయస్ఆర్‌సీపీ నేతలు.. మొత్తం డీఎస్సీ వ్యవహారంపై సీబీఐతో నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాపట్ల జిల్లా: మెగా డీఎస్సీ-2025లో జరిగిన అవకతవకలకు నిరసనగా బాపట్లలో వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. బాపట్ల వైయస్ఆర్‌సీపీ కార్యాలయం నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు చేపట్టిన ఈ ర్యాలీలో విద్యార్థులు, నిరుద్యోగ యువత, పార్టీ నాయకులు పెద్దఎత్తున పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డీఎస్సీ నియామకాలలో పారదర్శకత లేకుండా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించిన ఆందోళనకారులు.. మెరిట్ ఉన్న అభ్యర్థులకు అన్యాయం జరిగిందని మండిపడ్డారు. స్పోర్ట్స్ కోటా దుర్వినియోగం, పేపర్ లీకేజీలు, ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు కట్టబెట్టారనే ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగ అధ్యక్షుడు సోహిత్ యాదవ్, మాజీ ఉపసభాపతి కోన రఘుపతి, వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మెరుగు నాగార్జునతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని విమర్శించారు. మొత్తం డీఎస్సీ వ్యవహారంపై సీబీఐతో నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా: మెగా డీఎస్సీ-2025లో జరిగిన అవకతవకలకు నిరసనగా నరసరావుపేటలో వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా విద్యార్థి విభాగ అధ్యక్షుడు ఆకాష్ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, నిరుద్యోగ యువత, పార్టీ నాయకులు పెద్దఎత్తున పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైయస్ఆర్‌సీపీ పార్టీ కార్యాలయం నుంచి గడియార స్తంభం వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. డీఎస్సీ నియామకాలలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, అర్హులైన అభ్యర్థులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. స్పోర్ట్స్ కోటా దుర్వినియోగం, పేపర్ లీకేజీలు, ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు కట్టబెట్టారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, సత్తెనపల్లి నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. నిరుద్యోగ యువత ఆశలను ప్రభుత్వం ఛిన్నాభిన్నం చేసిందని విమర్శించారు. మొత్తం డీఎస్సీ వ్యవహారంపై సీబీఐతో నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా: మెగా డీఎస్సీ-2025లో జరిగిన అవకతవకలకు నిరసనగా కాకినాడలో వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. డీఎస్సీ నియామకాలలో చోటుచేసుకున్న అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు, పార్టీ కార్యకర్తలు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీ పరీక్షల్లో పేపర్ లీకేజీ, స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాల అమ్మకాలు జరిగాయనే ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. అర్హత, మెరిట్ ఉన్న అభ్యర్థులకు అన్యాయం చేసి అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. డీఎస్సీ నియామకాల ప్రక్రియలో పారదర్శకత పూర్తిగా లోపించిందని, నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని వైయస్ఆర్‌సీపీ నేతలు మండిపడ్డారు. మొత్తం వ్యవహారంపై సీబీఐతో నిష్పక్షపాత విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతపురం: మెగా డీఎస్సీ-2025లో జరిగిన అక్రమాలపై విద్యార్థి సంఘాలు, నిరుద్యోగ యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అనంతపురంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం నేతలు శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. డీఎస్సీ నియామకాలలో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా విద్యార్థులు వినూత్న రీతిలో ఉరేసుకున్నట్లుగా నిరసన తెలుపుతూ ప్రభుత్వ తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. “మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ”, “నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలి” అంటూ నినాదాలు చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు. ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన నాయకులు.. స్పోర్ట్స్ కోటా దుర్వినియోగం, పేపర్ లీకేజీలు, ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు కట్టబెట్టారనే ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. మొత్తం డీఎస్సీ వ్యవహారంపై సీబీఐతో నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.