శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణకు రండి

 కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆహ్వానం

తిరుమ‌ల‌:   భువనేశ్వర్‌లో టీటీడీ నిర్మించిన వేంకటేశ్వరస్వామి వారి దేవస్ధానం మహాసంప్రోక్షణ కార్యక్రమానికి హాజరు కావాలని టీటీడీ చైర్మన్  వైవీ సుబ్బారెడ్డి  కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను ఆహ్వానించారు. శుక్రవారం ఉదయం ఢిల్లీలో చైర్మన్ కేంద్ర మంత్రిని ఆయన కార్యాలయంలో కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.   మే  21 వ తేదీ నుంచి ఆలయ మహాసంప్రోక్షణకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, 26వ తేదీ విగ్రహ ప్రతిష్ఠ,  మహా సంప్రోక్షణ, ఆవాహన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు జరుగుతాయని కేంద్ర మంత్రి కి చైర్మన్ వివరించారు. 

ఢిల్లీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు రావలసినదిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ N V రమణ గారికి ఆహ్వానపత్రాన్ని అందిస్తున్న టీటీడీ చైర్మన్ శ్రీ వైవీ సుబ్బారెడ్డి గారు.

Back to Top