గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి

స్వామివారి తీర్థ‌ప్ర‌సాదాలు, 2022 క్యాలెండ‌ర్‌, డైరీ అంద‌జేత‌

విజ‌యవాడ‌: తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరించందన్‌ను రాజ్‌భ‌వ‌న్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సంద‌ర్భంగా గవర్నర్‌కు స్వామివారి తీర్థ‌ ప్రసాదాలు, 2022 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్, డైరీలను బహుకరించారు. కరోనా నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం చేపట్టిన చర్యలు, ప్రస్తుతం భక్తులను అనుమతిస్తున్న విధి, విధానాలను గురించి గవర్నర్ బిశ్వ‌భూష‌ణ్‌కు టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి వివరించారు. విపత్కర పరిస్థితుల నేపథ్యంలో భక్తుల శ్రేయస్సు దృష్ట్యా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా గవర్నర్ సూచించారు.

తాజా ఫోటోలు

Back to Top