జ‌ర్న‌లిస్టులు ఆరోగ్యంగా ఉండాలి 

టీటీడీ చైర్మ‌న్ వైవీ  సుబ్బారెడ్డి

ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో జ‌ర్న‌లిస్టుల‌కు కోవిడ్ వ్యాక్సినేష‌న్ 

తిరుప‌తి: మెరుగైన సమాజం కోసం పనిచేస్తున్న జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఉంటేనే ప్రజలకు వాస్తవ సమాచారాన్ని అందించేందుకు కృషి చేస్తార‌ని టీటీడీ చైర్మ‌న్ వైవీ ‌సుబ్బారెడ్డి అన్నారు.  ప్రభుత్వ విప్, తుడా చైర్మెన్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేతృత్వంలో జర్నలిస్టులకు నిర్వహించిన కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వైవీ ‌సుబ్బారెడ్డి మంగ‌ళ‌వారం ప్రారంభించారు.   మీడియా ప్ర‌తినిధులు కరోనా బారిన పడకుండా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండేందుకు  చంద్రగిరి శాసన సభ్యులు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ వేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం శుభపరిణామమ‌ని వైవీ ‌సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

క‌రోనా ప‌ట్ల ప్ర‌తి ఒక్క‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, మాస్కులు ధ‌రించాల‌ని, ఎప్ప‌టిక‌ప్పుడు శానిటైజ్ చేసుకోవాల‌ని సూచించారు.  తిరుపతి రూరల్ మండలం మూడో కార్యాలయంలో ఏర్పాటు చేసిన  కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ప్రభుత్వ విప్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్యే ద్వారకనాథ రెడ్డి  త‌దిత‌రులు పాల్గొన్నారు. 

తాజా వీడియోలు

Back to Top