కేంద్ర మంత్రి నిర్మ‌లాసీతారామ‌న్‌ను క‌లిసిన టీటీడీ చైర్మ‌న్‌

ఢిల్లీ: తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థాన పాలక మండ‌లి చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌ను క‌లిశారు. ఢిల్లీలో కేంద్ర‌మంత్రి నిర్మ‌లాసీతారామ‌న్‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసిన టీటీడీ చైర్మ‌న్‌ వైవీ సుబ్బారెడ్డి... శ్రీ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదాన్ని ఆమెకు అందించారు. టీటీడీ వద్ద ఉన్న పాత నోట్లు, భక్తుల కానుకలను డబ్బుల రూపంలో మార్చేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరారు. రాష్ట్రానికి సంబంధించిన ప‌లు విష‌యాల‌పై కేంద్ర‌మంత్రి నిర్మ‌లాసీతారామ‌న్‌తో చ‌ర్చించారు.

Back to Top