అసెంబ్లీ: రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పట్ల పారిశ్రామిక వేత్తలు ఎంతో నమ్మకంతో ఉన్నారని, గతంలో ఏ సదస్సుకు రానీ పారిశ్రామిక దిగ్గజాలు విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు హాజరయ్యారని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఈనెల 3, 4 తేదీల్లో విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ గ్రాండ్ సక్సెస్ అవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. సీఎం వైయస్ జగన్ బ్రాండ్ ఎలా ఉంటుందో జీఐఎస్‌తో ప్రపంచమంతా చూసిందన్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌పై అసెంబ్లీలో జరిగిన చర్చలో మంత్రి రోజా మాట్లాడారు.
జీఐఎస్‌లో రూ.13.41 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 352 ఎంవోయూలు జరిగాయి. దాదాపుగా 6 లక్షల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. యువత గురించి ఎప్పుడూ ఆలోచించే వ్యక్తి మన యూత్ ఐకాన్ సీఎం వైయస్ జగన్. అధికారంలోకి రాగానే సచివాలయ వ్యవస్థ తెచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఇవ్వాలని చట్టం తేవడమే కాకుండా.. పారిశ్రామిక వేత్తలు ఇబ్బందిపడకుండా మన పిల్లలకు వృత్తినైపుణ్యంలో శిక్షణ ఇస్తున్నారు.
దేశంలోనే అతిపెద్ద పారిశ్రామికవేత్తలు అయిన ముఖేష్ అంబానీ, కరణ్ అదానీ, నవీన్ జిందాల్, పునీత్ దాల్మియా, ఒబేరాయ్, జీఎంఆర్ లాంటి వారు జగనన్న నాయకత్వంలో నడుస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమ్మిట్‌కు మాత్రమే వచ్చారంటే.. రాష్ట్ర ప్రభుత్వం, వైయస్ జగన్ పట్ల పారిశ్రామిక వేత్తలు ఎంత నమ్మకంగా, సానుకూలంగా ఉన్నారో అర్థం చేసుకోవాలి.
ఒక నాయకుడు తన పార్టీ పెట్టి పదేళ్లు అయ్యిందని సభ పెట్టి దారినపోయేవారితో ఎంవోయూలు చేయించారని మాట్లాడాడు. ముఖేష్ అంబానీ, కరన్ అదానీ, జిందాల్, దాల్మియా, ఒబేరాయ్ వంటి పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలను దారినపోయేవారు అన్నాడంటే.. ఆ మనిషికి నిజంగా లోకజ్ఞానం ఉందా..? అని ప్రశ్నిస్తున్నా..
సీఎం వైయస్ జగన్ తీసుకువచ్చిన ఎన్నో చరిత్రాత్మకమైన నిర్ణయాలు చూసి పారిశ్రామిక వేత్తలు కూడా నమ్మకంతో మన రాష్ట్రానికి వచ్చి రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం అవుతామని చెప్పారంటే ఇది సీఎం వైయస్ జగన్ విజయం.
పరిశ్రమలు తరలిపోతున్నాయి, పారిశ్రామికవేత్తలు రావడం లేదని టీడీపీ చేసిన గోబెల్స్ ప్రచారాన్ని గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌తో తిప్పికొట్టాం. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నిర్వహించిన సదస్సుకు ఎప్పుడూ ఇలాంటి దిగ్గజ పారిశ్రామిక వేత్తలు రాలేదు. 44 నెలల్లోనే తన నాయకత్వంలో, తన పరిపాలనతో ఇంతమంది పారిశ్రామికవేత్తలను ఒకే వేదికపైకి తెచ్చారంటే.. సీఎం వైయస్ జగన్ ఇమేజ్ దేశ వ్యాప్తంగా ఎంత గొప్పగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.
దేశంలోనే అత్యధిక వృద్ధిరేటుతో అద్భుతంగా సీఎం వైయస్ జగన్ పరిపాలన చేస్తున్నారని స్వయంగా ముఖేష్ అంబానీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో అన్నారు. జే అంటే జగన్.. జే అంటే జోష్.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైయస్ జగన్‌తోనే సాధ్యమని పునీత్ దాల్మియా ప్రశంసించారంటే ఇంతకంటే సర్టిఫికెట్ ఏం కావాలి.. సంక్షేమం, అభివృద్ధిని రెండింటినీ అద్భుతమైన రీతిలో ముందుకు తీసుకెళ్తున్నారు. సీఎం వైయస్ జగన్ ఎప్పుడు ఏది చేసినా ట్రెండ్ చేస్తారు. ఈ సమ్మిట్‌తో ట్రెండ్ సెట్టర్ అని మరోసారి నిరూపించుకున్నారు.
పర్యాటక శాఖకు సంబంధించి కొన్ని కీలకమైన ఎంవోయూలు చేసుకున్నాం. పర్యాటక రంగంలో రూ.21,941 కోట్ల పెట్టుబడులతో 129 ఎంవోయూలు చేసుకున్నాం’’ అని మంత్రి రోజా అన్నారు.