ఏ నిఘా సంస్థ నివేదిక ఇచ్చిందో పవన్‌ చెప్పాలి

పవన్‌ కల్యాణ్‌పై పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ఫైర్‌

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మహిళల అదృశ్యంపై ఏ నిఘా సంస్థ పవన్‌ కల్యాణ్‌కు నివేదిక ఇచ్చిందో చెప్పాలని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా పవన్‌పై మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్‌ కల్యాణ్‌ వల్ల ఎంతమంది అమ్మాయిలు అదృశ్యమయ్యారో లెక్క తేలాలన్నారు. చంద్రబాబు సంస్థ హెరిటేజ్‌లో గంజాయి, నారావారిపల్లెలో ఎ్రరచందనం దొరుకుతుందన్నారు. రాష్ట్రంలో ఇంకెక్కడా గంజాయి దొరకడం లేదన్నారు.  రాయలసీమ నిజమైన ద్రోహి చంద్రబాబేనని, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఏ ఒక్క ప్రాజెక్టును నిర్మించలేని చంద్రబాబుకు రాయలసీమలో ప్రాజెక్టులను పరిశీలించే అర్హత లేదన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top