రేపు బీసీ సంక్రాంతి కార్యక్రమం

ముస్తాబైన విజ‌య‌వాడ‌లోని ఇందిరా గాంధీ మున్సిప‌ల్ స్టేడియం

విజయవాడ: ఈ నెల 17వ తేదీన బీసీ సంక్రాంతి కార్య‌క్ర‌మాన్ని ప్ర‌భుత్వం ఘ‌నంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.విజ‌య‌వాడ‌లోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో బీసీల సంక్రాంతి సభ ఏర్పాట్లను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ‌, జిల్లా క‌లెక్ట‌ర్ ఇంతియాజ్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. 56 బీసీ కార్పొరేషన్‌లతో సీఎం వైయ‌స్‌ జగన్‌ చారిత్రక ఘట్టానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. 50 శాతానికిపైగా మహిళలకు పదవులిచ్చి పూలే ఆశయాలు నెరవేర్చారని తెలిపారు. రాజకీయ ప్రాధాన్యత కల్పించటంతో బీసీల్లో ఆత్మనూన్యతా భావం పోయిందన్నారు. ప్రతి బీసీ ఇంట్లో సీఎం వైయ‌స్ జగన్‌ ఉంటారని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబును బీసీలు అసహ్యించుకోవటంతో మతి భ్రమించి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. గురువారం 56 బీసీ కార్పొరేష‌న్ల చైర్మ‌న్లు, 672 మంది డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేస్తార‌ని చెప్పారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌, మంత్రులు,ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు హాజ‌ర‌వుతార‌ని చెప్పారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top