నేడు ప్రొద్దుటూరులో మెగా జాబ్ మేళా  

వైయ‌స్ఆర్ జిల్లా:   సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు ఇవాళ ప్రొద్దుటూరులో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో మెగా జాబ్ మేళా నిర్వ‌హిస్తున్నారు.  రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే చదువుకున్న యువత, ఉద్యోగాల కోసం ఎదురు చూసేవారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే...  తద్వారా వారి కుటుంబానికి, రాష్ట్రాభివృద్ధికి దోహదపడతారనేది సుస్పష్టం. ఆదిశలో ప్రయాణం చేస్తూ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో జాబ్‌ మేళాలు నిర్వహిస్తున్నాం. ఇప్పటికే తిరుపతి, గుంటూరు, విశాఖలో మెగా జాబ్‌ మేళాలు నిర్వహిస్తే 350 కంపెనీలు పాల్గొన్నాయి. 40,243 ఉద్యోగాలు ఇచ్చాం. మూడు దశల్లో నిర్వహించిన జాబ్‌ మేళా ఇప్పుడు ముఖ్యమంత్రిగారి సొంత జిల్లాలో ప్రొద్దుటూరులో నాలుగో దశలో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నాం. 120 కంపెనీలు పాల్గొంటున్న ఈ మేళాలో 10వేల ఉద్యోగాలు కల్పిస్తామనే మంచి సంకల్పంలో నిర్వహించబోతున్నాం. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం ఈ మూడు కూడా సమాంతంరంగా అభివృద్ధి చెందాలి. ఆ దిశలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. యువతకు ఎప్పుడైతే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామో వాళ్ల ఆలోచనలు వేరేరకంగా వెళ్లకుండా ఉద్యోగంపై దృష్టి పెట్టి రాష్ట్రంతో పాటు కుటుంబ అభివృద్ధికి ఉపయోగపడతారు. ఉద్యోగ అవకాశాల కల్పన అనేది అత్యంత ప్రాధాన్యమైన విషయం.

 ఉన్న  ఉద్యోగాలు తీసేసిన చరిత్ర బాబుది

ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు మేము నిర్వహిస్తున్న జాబ్‌ మేళాను విమర్శిస్తున్నారు. గత ప్రభుత్వంతో కంపేర్‌ చేసుకుంటే 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఇంచుమించు 60 ప్రభుత్వ రంగ సంస్థలును మూసేశారు. ఉద్యోగాలు ఇచ్చేది కాకుండా... తీసేసిన ప్రభుత్వం చంద్రబాబుది.

అదే ఈ మూడేళ్ల కాలంలో గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేలు, వాలంటీర్‌ వ్యవస్థలో మొత్తం 4లక్షల 50వేల ఉద్యోగాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు కల్పించారు. ఇవి కాకుండా వైద్యరంగంలో 30వేలు ఉద్యోగాలు కల్పించారు. రాబోయే కాలంలో పోలీస్‌ శాఖలో ఉద్యోగాలు కల్పిస్తున్నారు. అలాగే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వoలో విలీనం చేశారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే ఇంచుమించు 5లక్షల ఉద్యోగాలను కల్పించిన ఘనత జగన్‌ మోహన్‌ రెడ్డిగారి ప్రభుత్వానికి దక్కుతుంది. దానికి విరుద్ధంగా చంద్రబాబు తన 14ఏళ్ల పాలనలో  ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేసి, ఉద్యోగాలను కల్పించడంపోయి, ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టిన ఘనత దేశంలో ఒక్క చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది.. తన హయాంలో ఒక్క జాబ్‌ మేళా అయినా నిర్వహించాడా అని తనను తాను ప్రశ్నించుకుంటే మా ప్రభుత్వాన్ని విమర్శించడు.

 ఉద్యోగాలు కల్పిస్తున్న వైయస్సార్‌ సీపీ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు చంద్రబాబుకు లేదు. అందుకే చంద్రబాబును అభినవ పులకేశిగా అభివర్ణించాలి. అలాంటి వ్యక్తిని నమ్మవద్దని సూచిస్తున్నాం. రాష్ట్రంలో చదువుకున్న ప్రతి ఒక్క నిరుద్యోగికి, విద్యార్థిని, విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చేవరకూ ఈ జాబ్‌ మేళా ప్రక్రియ కొనసాగుతుంది.

      కరోనా సమయంలో, రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం ఉన్నా ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలను విస్మరించకుండా వాటిని కొనసాగిస్తూ ఉద్యోగ అవకాశాలను కల్పించడం చాలా గొప్ప విషయం. దీన్ని మనం చంద్రబాబులా ప్రచారం చేసుకోవడం లేదు. వాస్తవంగా ఇది ప్రజలందరికీ మేలు చేస్తున్న ప్రభుత్వం. అలాగే ఏపీపీఎస్సీలో ఎన్నో ఉద్యోగాలు కల్పిస్తున్నాం. రాబోయే రెండేళ్లలో కూడా మరిన్ని ఉద్యోగాలు కల్పిస్తామని చెబుతున్నాం. 

వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు అధికారంలోకి వచ్చాక కడప జిల్లాలో పలు భారీ, మధ్యతరగతి పరిశ్రమలు వచ్చాయి,  మరెన్నో పరిశ్రమలను ఇక్కడకు తీసుకువస్తున్నారు, ఎన్ని రాబోతున్నాయేది ప్రత్యేకంగా జిల్లా ప్రజలకు చెప్పనవసరం లేదు. 50శాతం మహిళా సాధికారిత అనేది ముఖ్యమంత్రిగారి అభిమతం. గతంలో నిర్వహించిన జాబ్‌ మేళాల్లో 40 వేల ఉద్యోగాల్లో అధికంగా మహిళలు, మహిళా విద్యార్థినులు మాత్రమే ఎన్నిక కాబడ్డారు.

సోషల్‌ జస్టిస్‌ విషయానికి వస్తే... ముఖ్యమంత్రిగారు చాలా ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో అత్యుత్తమైన రాష్ట్రపతి  స్థానానికి ఒక ఎస్టీ మహిళను దేశ అధ్యక్షురాలుగా ఎన్నిక చేయడాన్ని ముఖ్యమంత్రిగారు సమర్థించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బడుగు, బలహీన వర్గాలతో పాటు అగ్రవర్ణాల్లో పేదలు అభివృద్ధి చెందేలా పథకాలు రూపొందిస్తున్నాం.

ఈ మధ్యకాలంలో నారా లోకేష్‌ ఏదేదో మాట్లాడుతున్నాడు. అతడు చదవిన చదువు ఏంటి? నిజంగానే చదివాడా? అయిదేళ్లు మంత్రిగా పనిచేసి, మంగళగిరి నియోజకవర్గంలో ఓడిపోయిన వ్యక్తి. మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని విమర్శించడానికి అర్హుడా అని సూటిగా ప్రశ్నిస్తున్నాం. యుద్ధ వీరులో, యుద్ధం చేసి గెలిచినవాళ్లో సవాల్‌ చేస్తే బాగుంటుంది. పప్పు తిని పడుకునే వ్యక్తి సవాల్‌ చేయడం సరికాదు.

ఎవరైతే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారో వారంతా ఈ జాబ్‌ మేళాను సద్వినియోగం చేసుకోవాలి. రిజిస్ట్రేషన్‌ చేసుకున్నవాళ్లు మాత్రమే కాకుండా రిజిస్ట్రేషన్‌ చేసుకోనివాళ్లు కూడా ఈ మేళాలో పాల్గొనవచ్చు. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం  చేసుకోండి. ఇంటర్వ్యూ జరిగినప్పుడు అధైర్యపడకుండా వాళ్లకు తెలిసింది చెబితే తప్పకుండా ఉద్యోగాలు వస్తాయి. ఎవరైతే ఎంపిక కాలేదో వారికి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రిగారు ఆదేశించారు. రెండేళ్లలో నిరుద్యోగ సమస్య అనేదే రాష్ట్రంలో లేకుండా చేయాలనే సంకల్పంతో ముందుకు వెళుతున్నాం. ముఖ్యమంత్రిగారి ఆశయాన్ని తప్పకుండా సాధించి తీరతాం.

ఎంపీ వైయ‌స్ అవినాష్‌ రెడ్డి మాట్లాడుతూ..
ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారి ఆదేశాల మేరకు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డిగారి నేతృత్వంలో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మూడు మెగా జాబ్‌ మేళాలు నిర్వహించడం జరిగింది. తిరుపతి, విశాఖ, గుంటూరులో నిర్వహించిన ఈ జాబ్‌ మేళాల ద్వారా దాదాపు 40వేల పైచిలుకు నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించాయి. అందులో భాగంగా వైయస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో వైయస్సార్‌ జిల్లాలో కూడా జాబ్‌ మేళా కండక్ట్‌ చేయాలని కోరగా.. అందుకు విజయసాయిరెడ్డిగారు తక్షణమే స్పందించి జాబ్‌ మేళాను నిర్వహించడానికి అంగీకరించారు. మూడు జాబ్‌ మేళాలను ఏ కంపెనీలు అయితే పాల్గొన్నాయో.. వాటితో పాటు అదనంగా మరికొన్ని కంపెనీలతో సంప్రదింపులు జరిపి, అవన్నీ పాల్గొనేలా ఒప్పించారు. దాదాపు 120 కంపెనీలు ఈ జాబ్‌మేళాలో పాల్గొంటున్నాయి. జిల్లాకు సంబంధించిన నిరుద్యోగ యువత ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 

25వ తేదీ శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ జాబ్‌ మేళాను నిర్వహించడం జరుగుతుంది. అన్ని రకాల క్వాలిఫికేషన్‌లకు సంబంధించిన నిరుద్యోగ యువత ఈ మేళాలో పాల్గొనవచ్చు. జాబ్ మేళా లో 10వ తరగతి నుంచి పీజీ వరకూ చదువుకున్న అందరికీ ఉద్యోగ అవకాశం కల్పిస్తాం. జాబ్‌మేళాకు విస్తృత ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ మేళాలో పాల్గొనేవారు ఎలాంటి కన్‌ఫ్యూజన్‌ లేకుండా, సమయం వృధా కాకుండా ఏఏ బ్లాక్‌లో ఏఏ కంపెనీలు, అర్హతలకు సంబంధించి అన్నింటిని సవివరంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఏ రూమ్‌లో ఏ కంపెనీ ఉంటుందనేది కూడా ఆ గది బయట వివరాలు పొందుపరిచాం. వచ్చేవారందరికీ భోజన వసతి కల్పిస్తున్నాం. జిల్లా నిరుద్యోగ యువత ఈ జాబ్‌మేళాను ఉపయోగించుకోవాలి.
 

Back to Top