కాసేప‌ట్లో గురుమూర్తి నామినేషన్

చిత్తూరు: తిరుపతి లోక్‌సభ స్థానానికి వైయ‌స్ఆర్ సీపీ అభ్యర్థిగా డాక్టర్‌ ఎం. గురుమూర్తి కాసేప‌ట్లో నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి అయిన నెల్లూరు జిల్లా కలెక్టర్‌కు నామినేషన్‌ పత్రాలను అందజేస్తారు. ప్ర‌స్తుతం దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్ర‌హానికి, డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ విగ్ర‌హాల‌కు గురుమూర్తి పూల‌మాల వేసి నివాళుల‌ర్పిస్తున్నారు. ఈ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కన్నబాబు, బాలి నేని శ్రీనివాసరెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్, గౌతమ్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామితో పాటు చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన పలువురు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, అభిమానులు హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.

తాజా ఫోటోలు

Back to Top