శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
 

 
 తిరుపతి: తిరుమల తిరుపతి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 7 వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయ‌ని,  గరుడ వాహనం నాడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పట్టు వస్త్రాలను స్వామి వారికి సమర్పించనున్నార‌ని టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా తిరుమలలో సీఎం జగన్‌ పలు అభివృద్ధి కార్యక్రమాలు.. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ సందర్భంగా టీటీడి చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అక్టోబర్7 నుంచి 15 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగుతాయిని ,అందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలిపారు.

 
నేడు అంకురార్పణ చేయగా, రేపు ధ్వజారోహణం కార్యక్రమం జరుగుతుందన్నారు. శ్రీ వారి వాహన సేవలు ఉదయం 9 నుంచి 10 గంటలు, రాత్రి 7 గంటల నుంచి 8 గంటల మధ్య నిర్వహిస్తామని తెలిపారు. కోవిడ్ వ్యాప్తి కారణంగా ఏకాంతంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో స్వర్ణ రథం, తేరు కూడా ఉండవని పేర్కొన్నారు. సర్వభూపాల వాహన నిర్వహణ ఉంటుందని చెప్పారు. బ్రహ్మోత్సవాలలో ఆగమోత్తంగా కైంకర్యాలు నిర్వహించనున్నారు. భక్తులు వీక్షించేందుకు వీలుగా యస్వీబీసీ నుంచి లైవ్, ఇతర చానల్ లింక్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

చక్రస్నాన మహోత్సవం కూడా ఆలయంలోని అయిన మహల్‌లో నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా గరుడ వాహనం నాడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పట్టు వస్త్రాలను స్వామి వారికి సమర్పించనున్నారు. ఈ సందర్భంగా తిరుమలలో సీఎం జగన్‌ పలు అభివృద్ధి కార్యక్రమాలు.. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్‌ అలిపిరి వద్ద నూతనంగా నిర్మించిన గోమందిరంను ప్రారంభించనున్నారు.పాత బర్డ్‌ హాస్పిటల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. వీటితో పాటు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ కన్నడ, హిందీ భాషలలో ప్రారంభించనున్నారు. తిరుమలలో స్వామివారి ప్రసాదాల తయారీకి నూతనంగా నిర్మించిన బూందీ పోటు నిర్మాణాన్ని కూడా ప్రారంభించనున్నారు. 

Back to Top