టిడ్కో ఇళ్లు అప్పగింత

పశ్చిమ గోదావరి: తాడేపల్లిగూడెంలో లబ్ధిదారులకు మంత్రులు టిడ్కో ఇళ్లు అప్పగించారు. 2,272 మంది లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లను అందజేశారు. గత ప్రభుత్వం టిడ్కో ఇళ్ల పేరుతో దోచుకుందని మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.4,500 కోట్ల నిధులతో టిడ్కో ఇళ్ల పనులను పూర్తి చేశామని చెప్పారు. తొలి దశలో తాడేపల్లిగూడెంలో 2,272 ప్లాట్లను లబ్ధిదారులకు అందజేశామని చెప్పారు. ఇల్లు లేని పేదవారికి స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించి ఇస్తున్నామని తెలిపారు. 

గత ప్రభుత్వం పేదవాడిపై భారం మోపిందని మంత్రి ఆదిమూలపు సురేష్‌ విమర్శించారు. టీడీపీ హయాంలో ఒక్క ఇల్లు సంపూర్ణంగా పూర్తి చేయలేదన్నారు. మౌలిక వసతులు వదిలేసి ఏ ప్లానింగ్‌ లేకుండా నిర్మాణాలు చేపట్టారని పేర్కొన్నారు. పెడింగ్‌లో ఉన్న  ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
 

Back to Top