బీసీల కోసం పోరాడుతున్న పార్టీ వైయస్‌ఆర్‌సీపీ

వైయస్‌ఆర్‌సీపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్‌.కృష్ణయ్య

రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం కల్పించడం పట్ల సీఎం వైయస్‌ జగన్‌కు కృతజ్ఞతలు

తాడేపల్లి: బీసీల కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అని రాజ్యసభ అభ్యర్థి, జాతీయ బీసీ నాయకుడు ఆర్‌.కృష్ణయ్య పేర్కొన్నారు. బీసీల కోసం పార్లమెంట్లో బిల్లు పెట్టారని గుర్తు చేశారు. తనను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేయడం పట్ల ఆర్‌.కృష్ణయ్య సీఎం వైయస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు.

సీఎం వైయస్‌ జగన్‌ ఈ రోజు తనకు రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల కోసం, వారి విద్య, వైద్యం, ఉద్యోగం, ఆర్థిక, రాజకీయ అభివృద్ధి కోసం, ఆ కులాలను పట్టి పీడిస్తున్న అమాయకత్వం నుంచి విడిపించేందుకు అనేక పోరాటాలు చేస్తున్నాను. తనను ఇన్నాళ్లు ఏ రాజకీయ పార్టీ కూడా గుర్తించలేకపోయింది. గుర్తించినా..పదవులు ఇవ్వడానికి ముందుకు రాలేదు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నా సేవలను, నిబద్ధత, అంకితభావాన్ని  గుర్తించారు. ఈ వర్గాలకు మరింత సేవ చేసే అవకాశం కల్పించారు. 
ఇటీవల చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో కూడా సీఎం వైయస్‌ జగన్‌ బీసీలకు 10 మంత్రి పదవులు ఇచ్చారు. అన్ని వర్గాలకు కలిపి 15 మంత్రి పదవులు ఇస్తే..ఒక్క బీసీలకే 10 పదవులు ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా బీసీ వర్గాలకు 10 మంత్రి పదవులు ఇవ్వలేదు. విభజన తరువాత కూడా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ 10  మందికి మంత్రి పదవులు ఇవ్వడం గొప్ప విషయం. 
పార్లమెంట్‌లో సీఎం వైయస్‌ జగన్‌ బీసీ బిల్లు పెట్టించారు. స్వాతంత్య్రం వచ్చి 74 ఏళ్లు అవుతుంది. ఏ రాజకీయ పార్టీ కూడా పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టలేదు. బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు పెట్టాలని ఏ ఒక్కరూ కూడా ఇంతవరకు కోరలేదు.  ఏపీ ప్రజలు, బీసీవర్గాలు గమనించాలి. దేశంలోని బీసీలందరూ వైయస్‌ జగన్‌ను ప్రశంసిస్తున్నారు. చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని, రాజకీయ, రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలని పార్లమెంట్‌లో పోరాడిన ఏకైక పార్టీ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ మాత్రమే. 
అనేక రాష్ట్రాల్లో బీసీ నేతలు ముఖ్యమంత్రులు అయ్యారు. ఏ ముఖ్యమంత్రి కానీ, ఏ బీసీ రాజకీయ పార్టీ కానీ పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టే సహసం చేయలేదు. సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశాలతో పార్లమెంట్‌లో ఎంపీలు బీసీ బిల్లు పెట్టారు. అన్నిరంగాల్లో జనాభా దమాషా పద్ధతిలో బీసీలకు వాటా కల్పించాలని పోరాటం చేశారు. 
రాష్ట్రంలోని 56 కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత వైయస్‌ జగన్‌దే. పాలక మండలి ఏర్పాటు చేసి బీసీలకు సామాజిక న్యాయం, ఆర్థికాభివృద్ధి, రాజకీయ గుర్తింపు ఇచ్చారు. 
సుప్రీం కోర్టు, ౖహె కోర్టులు బీసీల రిజర్వేషన్లను 34 నుంచి 22కు తగ్గించాయి. కానీ వైయస్‌ జగన్‌ అదనంగా రిజర్వేషన్లు పెంచారు. 44 శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించి పదవులు, పనుల్లో అవకాశం కల్పించారు. అందులో భాగంగానే నాకు రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం కల్పించారు. వైయస్‌ జగన్‌ తనపై ఉంచిన విశ్వాసాన్ని కాపాడుకుంటానని ఆర్‌.కృష్ణయ్య చెప్పారు. 

తెలంగాణలోనే కాదు..ఏపీలోనూ, దేశంలోని బీసీలందరి కోసం తాను పోరాటం చేశాను. ప్రైవేట్‌ రంగాల్లో కూడా రిజర్వేషన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యా, ఉద్యోగ, రాజకీయ అవకాశాల కోసం జాతీయ స్థాయిలో పోరాటం చేస్తున్నాను. నిలువెత్తు అంకితభావంతో బీసీల కోసం పోరాటం చేస్తున్నాను. స్వార్థ ప్రయోజనాల కోసం నేను విమర్శలు చేయడం లేదు. బీసీ వర్గాలకు తాను చేసిన సేవలను ముఖ్యమంత్రి గుర్తించారు. దేశంలో బీసీ ముఖ్యమంత్రులు చేయని సంక్షేమ కార్యక్రమాలు వైయస్‌ జగన్‌ చేశారు. బీసీ ప్రజలందరూ అభివృద్ధి చెందాలి. పేద కుటుంబాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు చదువుకోవాలి. ప్రతి ఒక్కరూ నన్ను అభినందిస్తున్నారు. అగ్రవర్ణాలు కూడా నన్ను అభినందిస్తున్నారు. అనేక సమస్యలపై పోరాటం చేస్తూ విజయం సాధించాను కాబట్టి అందరూ నన్ను సపోర్టు చేస్తున్నారని తెలిపారు. వైయస్‌ఆర్‌సీపీ పార్టీ పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టిందని గుర్తు చేశారు. పార్టీలో చేరానని చెప్పారు. వైయస్‌ జగన్‌ బహిరంగ సభల్లో మాట్లాడానని, వైయస్‌ఆర్‌ కుటుంబంతో ఎప్పటి నుంచో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పారు. తనకు అవకాశం కల్పించిన సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top