తాడేపల్లి: నార్త్ అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా పండుగాయల రత్నాకర్‌కు మరోసారి అవకాశం కల్పించడం పట్ల ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్ జగన్‌ను పండుగాయల రత్నాకర్ కలిసి ధన్యవాదాలు తెలిపారు. నార్త్ అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రత్నాకర్, తన పదవీకాలాన్ని నాలుగోసారి పొడిగించడంతో ముఖ్యమంత్రిని కలిసి పుష్పగుచ్చం అందజేసి ధన్యవాదాలు తెలిపారు.