ప్రజల మనోభావాలు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ గౌరవించారు

ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు

అంద‌రి అభీష్టం మేర‌కు శ్రీ‌కాకుళం జిల్లా కొన‌సాగింపు 

శ్రీ‌కాకుళం: జిల్లా ప్రజలు, ప్రజా సంఘాలు, ప్రజా ప్రతినిధులు అభీష్టం మేరకు శ్రీకాకుళం జిల్లాను కొనసాగించడం పట్ల ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు  హర్షం వ్యక్తం చేశారు. గురువారం శ్రీకాకుళం టౌన్ హాల్ నుంచి జి.టీ రోడ్ మీదుగా వైయ‌స్సార్ సర్కిల్ వర‌కు వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మ‌హానేత వైయ‌స్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీమంత్రి, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. ప్రజల మనోభావాలు, నాయకుల అభిప్రాయాలు ముఖ్యమంత్రి గౌరవించారు. గడించిన 80 సంవత్సరాలుగా ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబడిన శ్రీకాకుళం అభివృద్ధికి దోహదపడిన ఆర్థిక వనరులతో కూడిన నియోజకవర్గాన్ని యధాతధంగా కొనసాగించి ఎచ్చెర్ల తో కూడిన శ్రీకాకుళం జిల్లా ఏర్పాటు చేయడం పట్ల ముఖ్యమంత్రికి ధ‌ర్మాన కృతజ్ఞతలు తెలిపారు. 

శ్రీకాకుళం అభివృద్ధికి పునర్విభజన సమయంలో గతంలో జరిగిన అభివృద్ధి పోకూడదని ముఖ్యమంత్రి మానవత దృక్పథంతో ఆలోచన చేసి జిల్లాల విభజన గైడ్ లైన్స్ ను తరలించడం జిల్లా ప్రజల మనోభావాలను మన్నించడం గొప్ప సంస్కారానికి నిదర్శన‌మ‌న్నారు. జిల్లా వెనుకబాటుతనం, ఇరిగేష‌న్‌,  అభివృద్ధి, సముద్ర తీర ప్రాంతంలో ఫిషింగ్ హార్బర్, ఉద్దానం మంచినీటి పథకం తదితర ప్రయోజనాలు జిల్లా వాసులకు నష్టం వాటిళ్లకూడదనే ఆలోచనతో ముఖ్యమంత్రి శ్రీకాకుళం జిల్లాపై ప్రేత్యేక అభిమానాన్ని కనబరిచారని జిల్లా ప్రజ‌ల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా వెనుకబాటుతనం తీర్చే నాయకుడు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ మాత్రమేనని ధర్మాన స్పష్టం చేశారు. జిల్లాలో నూతన జిల్లాల ఏర్పాటు, విభజనతో ఏ ప్రాంతానికి నష్టం వాటిళ్లకూడదని జిల్లాకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు పెద్దలు అభిప్రాయాలను గౌరవించిన ముఖ్యమంత్రి కి జిల్లా ప్రజల తరుపున కృతజ్ఞతలు తెలిపారు. 

పార్లిమెంట్ ప్రాతిపదికన జిల్లా విభజన జరిగితే ఎంతో నష్టం జరిగేదని ఈ అభిప్రాయానే ఒక సదస్సులో ప్రస్తావించడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రజల కోరిక మేరకు మన్యం, రాయలసీమ జిల్లాల స్థానిక ప్రాంతాల వాసుల కోరికలు నెరవేర్చేలా ముఖ్యమంత్రి జిల్లాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. ప్రభుత్వం విధానాలు, అందిస్తున్న పాలన కొత్త వ్యవస్థ ద్వారా అభివృద్ధికి మరింత దోహదపడుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నూతన జిల్లాల ఏర్పాటు పై అన్ని వర్గాలు సంపూర్ణ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, చిన్నచిన్న అభిప్రాయ బేధాలు తప్ప ప్రజలు జిల్లాల విభజనకు పట్ల అంతా సానుకూలంగా ఉన్నారని ఎమ్మెల్యే ధర్మాన స్పష్టం చేశారు.

కార్యక్రమంలో రాష్ట్ర తూర్పు కాపు, కళింగ వైశ్య,  కార్పొరేషన్ చైర్మన్లు మామిడి శ్రీకాంత్, అంధవరపు సూరిబాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ మెంటాడ పద్మావతీ, ఎంపిపి గోండు రఘురాం, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ గోండు కృష్ణ, వైయ‌స్ఆర్‌సీపీ  నాయకులు సాధు వైకుంఠ రావు, డాక్టర్ పైడి మహేశ్వరరావు, మండవిల్లి రవి, మెంటాడ స్వరూప్, రఫీ, సుంకర కృష్ణ, పైడి రాజారావు, అంధవరపు సంతోష్, చౌదరి సతీష్, ఎన్ని ధనుంజయ్, ఎచ్చెర్ల శ్రీధర్, మార్పు పృథ్వి, బైరి మురళి, ఉన నాగరాజు,  సీజు, తారక్, ఎండ రమేష్, గోవింద్, వనపల్లి రమేష్,  మైలపల్లి మహాలక్ష్మి, పూడి కమల, కామేశ్వరి,  జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Back to Top