ఎమ్మెల్యే చెవిరెడ్డిపై దాడికి యత్నం

వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌చారాన్ని అడ్డుకున్న టీడీపీ నేత‌లు 
 

చంద్రగిరి: ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో టీడీపీ నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న వైయ‌స్ఆర్‌సీపీ నాయకులకు అడ్డుతగులుతున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ముంగిలిపట్టులో వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డిని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని అనుచరులు అడ్డుకున్నారు. పథకం ప్రకారం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన అల్లరి ముకులు రెచ్చిపోయారు. పులివర్తి నాని దగ్గరుండి టీడీపీ కార్యకర్తలను ఉసిగొల్పడంతో పేట్రేగిపోయారు. పచ్చ కార్యకర్తలు చెవిరెడ్డి వాహనం మీద దాడి చేశారు. పట్టాభి నాయుడు అనే కార్యకర్త బెల్టుతో వీరంగం సృష్టించాడు. పలువురు వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలపై అధికార పార్టీ కార్యకర్తలు దాడికి దిగారు.

Back to Top