టీడీపీ ఎంపీ రవీంద్రబాబు వైయస్‌ఆర్‌సీపీలో చేరిక

హైదరాబాద్‌: టీడీపీకి చెందిన అమలాపురం ఎంపీ రవీంద్రబాబు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. టీడీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసిన రవీంద్రబాబు వైయస్‌ జగన్‌ను కలిశారు. ఆయనకు కండువా కప్పి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇటీవల అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డిలు టీడీపీ వీడి వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. అలాగే పలువురు పార్టీ వ్యవస్థాపక సభ్యుడు జై రమేష్, సీనియర్‌ నేతలు ఇరిగెల రాంపుల్లారెడ్డి, తదితరులు వైయస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరారు.  

గిద్దలూరు ఎంపీపీ వంశిధర్ రెడ్డి, అర్ధవీడు ఎంపీపీ రవికుమార్, అర్ధవీడు జడ్పీటీసీ వెంకటలక్ష్మి, ఎంపీటీసీ రామకృష్ణా రెడ్డి, సింగల్ విండో సొసైటీ అధ్యక్షలు కృష్ణా రెడ్డి, ఎదురు శ్రీనివాస్ రెడ్డి, ఉడుముల సుధాకర్ రెడ్డి, రంగారెడ్డి లు చేరారు.

గిద్దలూరు నియోజకవర్గ సమన్వయ కర్త అన్నా రాంబాబు ఆధ్వర్యంలో 40 మంది చేరారు.

 

Back to Top