సీఎం స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్ సీపీలో చేరిన టీడీపీ నేత క‌న‌క సుంద‌ర‌రావు

స‌చివాల‌యం: తెలుగుదేశం పార్టీ నాయ‌కుడు, తాడేప‌ల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే ప‌స‌ల క‌న‌క సుంద‌ర‌రావు, ప‌లువురు టీడీపీ నేత‌లు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అసెంబ్లీలోని ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో ప‌స‌ల క‌న‌క సుంద‌ర‌రావు, ప‌లువురు టీడీపీ నేత‌లు వైయ‌స్ఆర్ సీపీలో చేరారు. ఈ మేర‌కు వారికి కండువాలు క‌ప్పి పార్టీలోకి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఏపీ అసెంబ్లీ చీఫ్‌విప్‌ ముదునూరి ప్రసాదరాజు, పలువురు నేత‌లు పాల్గొన్నారు. 

Back to Top