రెచ్చిపోతున్న ప‌చ్చ‌ మూక‌లు

సర్పంచ్‌ కుటుంబంపై టీడీపీ వర్గీయుల దాడి

కర్నూలు జిల్లా:   కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ప‌ల్లెల్లో ప్ర‌శాంత‌త క‌రువైంది. అధికార మ‌దంతో చీటికి మాటికి గొడ‌వ‌లు సృష్టిస్తున్నారు. ఆస్పరి మండలంలోని యాటకల్లు గ్రామానికి చెందిన వైయ‌స్ఆర్‌సీపీ సర్పంచ్‌ సుధారాణి, ఆమె భర్త పెద్దరెడ్డి, కుమారుడు సతీష్‌రెడ్డిపై అదే గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు ఆరుగురు కట్టెలు, రాళ్లతో దాడి చేసి గాయపరిచారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సర్పంచ్‌ ఇంటికి ఎదురుగా ఉన్న సుంకన్న, అతని కుమారులు చీటికిమాటికీ దుర్భాషలాడుతున్నారని, తామేమి తప్పు చేశామని ప్రశ్నించడంతో, తమనే ప్రశ్నిస్తావా అంటూ సుంకన్న, కృష్ణ, సుదర్శన్‌, ఓబులేషు, సుంకులమ్మ, రాధిక కలిసి కట్టెలు, రాళ్లతో తమపై దాడి చేశారని సర్పంచ్‌ భర్త పెద్దరెడ్డి ఆస్పరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గాయపడిన ముగ్గురు ఆదోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పెద్దరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నరసింహులు తెలిపారు.

Back to Top