డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా: పార్టీ బలోపేతానికి డిజిటల్ వెరిఫికేషన్ ప్రక్రియ దోహదపడుతుందని వైయస్ఆర్‌సీపీ పి.గన్నవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు అన్నారు. పి.గన్నవరం నియోజకవర్గం, పి.గన్నవరం మండలంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిజిటల్ వెరిఫికేషన్ (వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపు కార్డు) కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షులు యన్నాబత్తుల ఆనంద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం, పి.గన్నవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సాగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి, కొత్తపేట నియోజకవర్గ పరిశీలకులు పాటి శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి డిజిటల్ వెరిఫికేషన్ ప్రక్రియ ఎంతో ఉపయోగకరమని, ప్రతి కార్యకర్త తన గుర్తింపు కార్డును ధృవీకరించుకోవాలని పిలుపునిచ్చారు. పార్టీ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు. అలాగే అంబాజీపేట మండల అధ్యక్షులు విత్తనాల ఇంద్రశేఖర్, జిల్లా సోషల్ మీడియా అధ్యక్షులు దొమ్మేటి సత్యమోహన్, జిల్లా విద్యార్థి విభాగ అధ్యక్షులు ఎం. శిరీష్, నియోజకవర్గ సోషల్ మీడియా అధ్యక్షులు దొమ్మేటి దుర్గారావు, నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షులు రాణి శ్రీధర్, అయినవిల్లి మండలం బీసీ సెల్ అధ్యక్షులు కర్రి సుబ్రమణ్యం, జిల్లా ఎస్సీ సెల్ నాయకులు పుచ్చకాయల నరసింహమూర్తి పాల్గొన్నారు. ఇక నాలుగు మండలాల నుంచి యువజన విభాగం, విద్యార్థి విభాగం, ఐటీ విభాగం, సోషల్ మీడియా విభాగం కార్యకర్తలు మరియు యువ నాయకులు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు.