రాష్ట్రంలో బ‌రితెగిస్తున్న టీడీపీ గూండాలు

వైయ‌స్ఆర్‌సీపీ మహిళా కార్యకర్తలపై దాడి
 

తాడేపల్లి: ఏపీలో టీడీపీ గూండాలు బ‌రితెగిస్తున్నారు. కూటమి పాలనలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగం నడిపిస్తూ వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలను టార్గెట్‌ చేసి దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా మహిళలు అని కూడా చూడకుండా పచ్చ మంద కత్తులు, క‍ర్రలతో దాడి చేశారు. ఈ ఘటనపై వైయ‌స్ఆర్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

వైయ‌స్ఆర్‌సీపీ ట్విట్టర్‌ వేదికగా టీడీపీ కార్యకర్తలు మహిళలపై దాడి చేసిన వీడియోను షేర్‌ చేసింది. ఈ సందర్బంగా.. రాష్ట్రంలో టీడీపీ గూండాలు బరితెగించారు. మార్కాపురం నియోజకవర్గం పొదిలి పట్టణం ఐదవ వార్డులోని నవాబుమెట్టలో వైయ‌స్ఆర్‌సీపీ మహిళా కార్యకర్తలపై కర్రలు, కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేసిన టీడీపీ గూండాలు. వీరి దాడిలో మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చి, పాలనను గాలికి వదిలేసి మహిళలపై దాడులు జరుగుతున్నా ఏమీ పట్టనట్టు చోద్యం చూస్తున్నారా సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత’ అంటూ ఘాటు విమర్శలు చేసింది. 

 

Back to Top