కుప్పంలో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు

వైయ‌స్ఆర్‌సీపీ కార్య‌క‌ర్త‌పై దాడి 
 

 చిత్తూరు: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. కొంగణపల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై దాడికి పాల్పడ్డారు. వైయ‌స్ఆర్‌సీపీకి చెందిన ఓ అభిమాని పార్టీ గుర్తు చూపడంతో చంద్రబాబు ఎదుటే తెలుగు తమ్ముళ్లు విచక్షణా రహితంగా దాడి చేశారు. అనంతరం వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసుకున్న ప్లెక్సీలను ధ్వంసం చేశారు. టీడీపీ నేతల దాడిలో వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త శ్రీనివాసులుకు తీవ్ర గాయాలయ్యాయి. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top