తాడేపల్లి: ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు ‘మనబడి నాడు–నేడు’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు స్ఫూర్తి పొంది తానా ఫౌండేషన్ (ఇండియా) రూ.50 లక్షల విరాళం ప్రకటించింది. ఈ మేరకు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను వైయస్‌ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శి తాతినేని పద్మావతి, తాతినేని వెంకట కోటేశ్వరరావు దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తానా ఫౌండేషన్ (ఇండియా) మేనేజింగ్ ట్రస్టీ, సెక్రటరీ కేఆర్‌కే ప్రసాద్ తరపున రూ.50 లక్షల విరాళానికి సంబంధించిన చెక్కును సీఎంకు అందజేశారు.