సీఎం పదవి నుంచి తొలగించాలనే అభ్యర్థన విచారణ అర్హత లేదు

సీజేఐకి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ రాసిన‌ లేఖపై దాఖలైన మూడు పిటిషన్ల‌పై సుప్రీం లో విచారణ 

న్యూఢిల్లీ: ఏపీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సీజేఐకి రాసిన లేఖ‌ను మీడియాకు విడుద‌ల చేయ‌డం స‌రికాద‌ని, ఆయ‌న్ను ముఖ్య‌మంత్రి ప‌ద‌వి నుంచి తొల‌గించాల‌ని సుప్రీం కోర్టులో దాఖ‌లైన పిటిష‌న్‌ను ధ‌ర్మాస‌నం కొట్టి వేసింది. పిటిష‌న‌ర్ అభ్య‌ర్థ‌న విచార‌ణ‌కు అర్హ‌త లేద‌ని స్ప‌ష్టం చేసింది. మంగ‌ళ‌వారం సుప్రీం కోర్టులో సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిష‌న్‌పై జిఎస్ మణి, ప్రదీప్ కుమార్ విచార‌ణ జ‌రిపి యాంటీ కరేప్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ పిటిషన్ ను కొట్టివేసింది. సునీల్ కుమార్ సింగ్ వేసిన పిటిషన్ ను ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ కి జత చేసిన సుప్రీం కోర్టు. గ్యాగ్ ఆర్డర్ ఎత్తి వేసిన  తర్వాత, మీడియాకు లేఖ విడుదల అనే అంశం అర్థం లేనిది అన్న జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్‌..లేఖ‌లోని అంశాలపై సీబీఐ దర్యాప్తు జరపాలా వద్దా అన్నది సి జే ఐ పరిధిలోని అంశమ‌ని తెలిపారు. సీఎం పదవి నుంచి తొలగించాలనే అభ్యర్థన కు విచారణ  అర్హత లేదని తేల్చి చెప్పారు. లేఖలో అంశాలపై ఇప్పటికే వేరే  బెంచ్ పరిశీ లిస్తోంది..పత్రికల్లో కథనాలు చూసి  పిటిషన్లు వేయడంపై జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ అసహనం వ్యక్తం చేశారు. పిటిషన్లలో అభ్యర్థనలు అన్ని గందరగోళంగా ఉన్నాయని వ్యాఖ్యనించారు. యాంటీ కరప్షన్ కౌన్సిల్ ఎక్కడిదని, నిధులు ఎక్కడి అని ప్రశ్నించిన ధర్మాసనం .. లేఖలోని అంశాలపై ఎంత మంది జోక్యం చేసుకుంటారని సుప్రిం కోర్టు ప్ర‌శ్నించింది. ఇలాంటి పిటిషన్లను తాము అనుమతించేది లేదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top