సుంద‌ర‌రామ శ‌ర్మ వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

తాడేప‌ల్లి:  ప్ర‌ముఖ రాజ‌కీయ విశ్లేష‌కుడు సుంద‌ర‌రామ శ‌ర్మ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.సోమ‌వారం తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి స‌మ‌క్షంలో సుంద‌ర‌రామ‌శ‌ర్మ వైయ‌స్ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయ‌న‌కు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి కండువా క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు.  సుందరరామ శర్మ గతంలో ఏపీ పీసీసీ లీగల్ సెల్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top