వైయస్ఆర్ జిల్లా: వైయస్ జగన్ మోహన్ రెడ్డి సార్ మీరు లెజెండరీ ముఖ్యమంత్రి అంటూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు కితాబు ఇచ్చారు. వేంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనాల ప్రారంభోత్సవం అనంతరం ముఖ్యమంత్రి వైయస్ జగన్ విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సమక్షంలో మాట్లాడిన విద్యార్ధులు ఏమన్నారంటే...వారి మాటల్లోనే శశికుమార్, 10 వ తరగతి విద్యార్ధి, జెడ్పీహెచ్‌ఎస్ బాయ్స్, వేంపల్లి జగన్ సార్ మీరు లెజెండరీ సీఎం, గతంలో మా స్కూల్ భవనాలు పూర్తి శిధిలావస్ధలో ఉన్నాయి, కానీ మీరు నాడు నేడు ద్వారా మా కష్టాలన్నీ తొలగించారు, స్కూల్ ఇప్పుడు చాలా బావుంది, నా స్నేహితులు కూడా ఈ స్కూల్‌లో చేరారు. జగనన్న అమ్మ ఒడి పథకం చాలా బావుంది, మా అమ్మ అకౌంట్‌లో నేరుగా నగదు జమ అయింది, గతంలో మేం రోజు కూలికి వెళ్ళాలని తల్లిదండ్రుల ఒత్తిడి ఉండేది, కానీ ఇప్పుడు ఆ పరిస్ధితి లేదు. మేం చక్కగా పాఠశాలకు వచ్చి చదువుకుంటున్నాం. జగనన్న విద్యాకానుక క్రింద ఇస్తున్నవన్నీ చాలా బావున్నాయి, ఒక్క రూపాయి చెల్లించకుండా అన్నీ తీసుకుంటున్నాం. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడం గొప్ప పరిణామం, దీని వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల నైపుణ్యం పెరుగుతుంది. జగనన్న గోరుముద్ద ద్వారా చక్కటి భోజనం ఇస్తున్నారు. నేను మీ పాలనలో ప్రభుత్వ పాఠశాలలో చదవడం గర్వంగా భావిస్తున్నాను. నేను గ్లోబల్ స్టూడెంట్‌గా మారుతాను, ధ్యాంక్యూ సార్. జి. భానుశ్రీ, 10 వ తరగతి, జెడ్పీహెచ్‌ఎస్ గర్ల్స్, వేంపల్లి అందరికీ వందనాలు, సార్ నిజంగా చెబుతున్నాను, విద్య విలువ తెలిసిన సీఎంగారు ఎలా ఉండాలో దానికి నిలువెత్తు నిదర్శనం మీరు, నిజంగా మీలాంటి సీఎం దొరకడం మాకు అదృష్టం. మన బడి నాడు నేడు పథకానికి సాక్ష్యమే మా ఈ స్కూల్ బిల్డింగ్. ఇలాంటి పాఠశాలలో చదువుతానని నేను కలలో కూడా అనుకోలేదు. మా నాన్న లారీ డ్రైవర్, మా అమ్మ రోజూ కూలీ పనులకు వెళుతుంది, నాకు అమ్మ ఒడి రాకుంటే నేను కూడా కూలీ పనులకు వెళ్ళాల్సి వచ్చేది. నేను ఈ రోజు ఇక్కడ ఉన్నానంటే మీరే కారణం, ఏమిచ్చి మీ రుణం తీర్చుకోను జగన్ మామయ్యా, జగనన్న విద్యాకానుకలో అన్నీ ఇచ్చి నా సొంత మేనమామలా ఆదుకున్నారు. మా అమ్మ కూడా నా సొంత అన్నదమ్ముళ్ళు కూడా జగనన్నలా ఆదుకోలేరేమో అని మీ గురించి గొప్పగా చెబుతూ ఉంటుంది. గతంలో మధ్యాహ్న భోజనం చేయాలంటే అయిష్టంగా తినేవాళ్ళం, కానీ ఇప్పుడు పౌష్టికాహారం ఇష్టంగా తింటూ రక్తహీనతకు దూరంగా ఆరోగ్యంగా ఇలా ఉన్నానంటే గోరుముద్దే కారణం. నేను ఈ రోజు ఇంగ్లీష్ మీడియం చదువుతూ బైజూస్ ప్రోగ్రామ్, లెర్నింగ్ యాప్‌ల ద్వారా మా వెన్నంటే ఉండి మమ్మల్ని ఉన్నత చదువులవైపు నడిపిస్తున్నారు. అంతేకాకుండా బాలికల కోసం ప్రత్యేకంగా జూనియర్ కాలేజి ఏర్పాటుచేసి మాకు చదువుకునే అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీ సహకారంతో నేను ఒక గ్లోబల్ స్టూడెంట్‌గా ఎదిగి ఉన్నత స్ధాయికి చేరుకుంటానని మీకు మాట ఇస్తున్నాను. మీరే మాకు ఎల్లప్పుడూ సీఎంగా ఉంటూ మాలాంటి పేద విద్యార్ధులకు తోడుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను, ధ్యాంక్యూ.