అబద్ధాల బాబు ప్రాపకం కోసం ఎల్లోమీడియా రోతరాతలు

 మీడియా స‌మావేశంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి  

మేదరమెట్ల సిద్ధం సభకు లక్షలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు

గ్రాఫిక్స్‌కు పేటెంట్‌ చంద్రబాబు.. జనం లేని పార్టీకి సేనాని పవన్‌కళ్యాణ్‌

రూ.2.70 లక్షల కోట్లు ప్రజలకు అందివ్వడం కూడా గ్రాఫిక్సేనా..?

2024 ఎన్నికల్లో వైయ‌స్‌ఆర్‌సీపీ సునామీ ఖాయం: మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి  

నెల్లూరు: అబద్ధాల చంద్ర‌బాబు ప్రాపకం కోసం ఎల్లోమీడియా రోతరాతలు రాస్తోంద‌ని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిప‌డ్డారు. నెల్లూరులో క్యాంప్‌ కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సోమ‌వారం మీడియాతో మాట్లాడారు.

మంత్రి కాకాణి ఇంకా ఏమన్నారంటేః

నాలుగు ‘సిద్ధం’ సభలు సూపర్ సక్సెస్ః
వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మేదర మెట్లలో నిన్న జరిగిన ‘సిద్ధం’ సభకు ప్రజల నుంచి భారీగా స్పందన లభించింది. బాపట్ల, పల్నాడు, గుంటూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల నుంచి లక్షలాది మంది హాజరై ‘సిద్ధం’ సభను జయప్రదం చేశారు. గ్రామాల నుంచి వైఎస్‌ఆర్‌సీపీ నేతలు, పార్టీ కార్యకర్తలే కాకుండా ప్రజలు కూడా ఎవరికి వారు స్వచ్ఛందంగా తరలివచ్చారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో హాజరైన వారందరికీ నా తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

జీవితంలో ఇలాంటి విచిత్రం ఎన్నడూ చూడ్లేదుః
దాదాపు 60 ఏళ్లుగా మా కుటుంబం రాజకీయాల్లో ఉంది. మేము ఏదైనా మహాసభలకు ప్రజల్ని తరలించాలంటే బస్సులు, లారీలు ఏర్పాటు చేసి   రండి రండంటూ అందర్నీ బతిమాలి రప్పించాల్సి వచ్చేది. గతంలో ఇలాంటి పరిస్థితులు జాతీయస్థాయి నాయకులు నెల్లూరుకు వచ్చినప్పుడు కూడా చూశాం. అయితే, నిన్న మేదరమెట్ల సభకు సంబంధించి మాత్రం ఒక విచిత్రమైన పరిస్థితిని చూడాల్సి వచ్చింది. నెల్లూరు, తిరుపతికి దాదాపు 250 కిలోమీటర్లకు పైగా దూరమున్న మేదరమెట్ల సభకు కేవలం మగవాళ్లు వస్తే చాలని .. మహిళలెవరూ రావడానికి ఇబ్బందిపడొద్దని ఊరూరా చెప్పాం. వీలైనంత మేరకు రవాణా సౌకర్యాల్ని అధికంగానే ఏర్పాటు చేశాం. ఇంత చేసినా.. మేము రావడానికి మాకు బస్సులు ఎందుకు ఏర్పాటు చేయలేదని చెప్పి అలకబూనిన విచిత్ర పరిస్థితిని మేము ఇప్పుడే సరికొత్తగా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇది నా జీవితంలో మొట్టమొదటి సారిగా చూస్తున్నాను.

 లక్షలాది జనంతో రాష్ట్ర చరిత్ర సభ అదిః
 బస్సులు, కార్లు ఏర్పాటు చేస్తే.. చెప్పినోళ్లు కాకుండా చెప్పనోళ్లు కూడా ముందుగానే వచ్చి ఎక్కి కూర్చొన్నారు. చాలామంది నిలబడి మరీ ప్రయాణిస్తే.. మరికొందరు కుర్చీల్లేకున్నా.. కింద కూర్చొని ఇబ్బందులు పడుతూ సభకు తరలివచ్చా రు. మొత్తానికి ఆయా జిల్లాల నుంచి ఇదేవిధంగా లక్షలాది మంది జనం తరలివచ్చి జగన్‌మోహన్‌రెడ్డి గారికి ఆశీస్సులు అందించారు. రాష్ట్ర చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున జరిగిన సభగా ఇది నిలిచిపోతుంది. అంతస్థాయిలో స్పందన చూపించిన ప్రజలందరికీ పేరు పేరునా నా హృదయపూర్వక ధన్యావాదాలు తెలియజేస్తున్నాను. 

చంద్రబాబు కడుపుమంట.. ఎల్లోమీడియా అవస్థలుః
ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరాయి కనుక మనం ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టి నేరుగా జగన్‌మోహన్‌రెడ్డి గారికి మనం ఆశీస్సులు అందించాలనే లక్ష్యం నిన్న ప్రజల్లో కనిపించింది. పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలతో సంబంధం లేకుండా ఒక అరుదైన ఆలోచనతో ప్రజలు తండోపతండాలుగా స్వచ్ఛందంగా తరలిరావడమనే ది మేమొక చరిత్రగా చూస్తున్నాం. మరి, ఇంత చరిత్ర ఒక్కచోట కనిపించడంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు కన్నుకుట్టింది. ఇది చాలా దురదృష్టకరం. జగన్‌ గారి సభ ఎప్పుడు జరిగినా చంద్రబాబుకు వెంటనే గ్యాస్ట్రిక్‌ ట్రబుల్‌ ఆరంభమై కడుపు మంటతో రగిలిపోవడాన్ని అందరూ సహజంగానే చూస్తూ వస్తున్నారు. ఆయన కడుపు మంటకు ఉపశమనంగా తనకనుకూలంగా ఉన్న పచ్చ మీడియా, వాట్సప్, ట్విట్టర్, యూట్యూబ్‌ ఫ్లాట్‌ఫామ్‌లతో పాటు సోషల్‌మీడియా రకరకాల వండివార్పులతో మా సభలు సక్సెస్‌ కాలేదని చూపించి సంతృప్తి పరుస్తుంటారు. 

రూ.2.70 లక్షల కోట్లు ప్రజలకు అందివ్వడం కూడా గ్రాఫిక్సేనా..?
లక్షలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి జగన్‌మోహన్‌రెడ్డి గారిని ఆశీర్వదించడం గ్రాఫిక్స్‌ అంటూ ఎల్లోమీడియా రోత రాతలు రాసింది. అంటే, రాష్ట్ర చరిత్రలో ముందెన్నడూ ఎరుగని రీతిగా రూ.2.70 లక్షల కోట్లు ప్రజలకు డీబీటీ ద్వారా నేరుగా వారి ఖాతాల్లో జమచేసింది గ్రాఫిక్స్‌నా..? అమ్మఒడి, రైతుభరోసా, వైఎస్‌ఆర్‌ చేయూత, వైఎస్‌ఆర్‌ ఆసరా వంటి పథకాలు నేరుగా ఇంటికి అందించింది గ్రాఫిక్స్‌నా..? రజకులు, నాయీబ్రాహ్మణులకు, టైలర్లుకు రూ.10వేల చొప్పున అందించింది గ్రాఫిక్స్‌నా..? జగనన్న విద్యాదీవెన, వసతిదీవెన విద్యార్థులకు అందించింది గ్రాఫిక్స్‌నా.? ఇళ్లు లేని నిరుపేదలకు మహిళల పేరిట ఇంటి స్థలాలివ్వడం గ్రాఫిక్స్‌నా.? స్థలాలిచ్చిన వారికి ఇళ్లు కూడా కట్టించి ఇవ్వడం గ్రాఫిక్స్‌నా..? వీటన్నింటికీ చంద్రబాబు నాయుడు, ఎల్లోమీడియా యాజమాన్యాలు దమ్ముంటే సమాధానం చెప్పాలని నేను డిమాండ్‌ చేస్తున్నాను. ఎంతకాడికి, జగన్‌మోహన్‌రెడ్డి గారికి విపరీతంగా ప్రజలు వచ్చారనేది మీ ఆక్రోశం గా కనిపిస్తుంది. 

 గ్రాఫిక్స్‌ పేటెంట్‌దారే చంద్రబాబుః
అసలు, నిజమైన గ్రాఫిక్స్‌కు పేటెంట్‌ ఎవరికుంది..? ఎవరు మొట్టమొదటి సారి దాన్ని ప్రమోట్‌ చేసింది..? అని పిల్లోడిని అడిగినా చంద్రబాబు అనే సమాధానమొస్తుంది. ఆయన ఏ స్థాయిలో దాన్ని ప్రమోట్‌ చేశాడంటే, రాజధాని అమరావతిని పూర్తి చేయకుండానే.. దాని అద్భుత కట్టడం ఎలా ఉంటుందనే విషయాన్ని చంద్రబాబు గ్రాఫిక్స్‌లో చూపించాడు. అమరావతి గ్రాఫిక్స్‌ను ఏరకంగా చూపించాలనేందుకు నిర్మాణ నిపుణుల కమిటీలో సినీ దర్శకుడు రాజమౌళిని కూడా చేర్చారు. బాహుబలి సినిమాలో ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు గ్రాఫిక్స్‌ పెట్టి ప్రేక్షకుల్ని రక్తికట్టించారు కాబట్టి.. ఆయన్ను ఈ కమిటీలో పెట్టాడు. అదేవిధంగా కట్టనిది కట్టినట్టుగా చూపించడమనేది చంద్రబాబు బుద్ధి, ఆయన విధానం, వారి సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం. ప్రజలకు గ్రాఫిక్స్‌లను చూపెట్టి వారి ఆశలన్నీ తీర్చినట్లు మాట్లాడటం చంద్రబాబు ఒక్కడికే చెల్లింది. అలాంటి నీచమైన మనస్తత్వం కలిగినటువంటి నువ్వు .. నీలాగే అందరూ వ్యవహరిస్తారని అనుకోవడం చాలా పొరబాటు. సభా ప్రాంగణంలోని నేలమీద కార్పెట్‌ను కూడా గ్రీన్‌మ్యాట్‌ అంటూ .. గ్రాఫిక్స్‌లో జనాన్ని చూపెట్టామని ఎల్లోమీడియా రాతలతో చంద్రబాబు రోతను బయట పెట్టుకోవడం సిగ్గుచేటు. 

ఎల్లోమీడియా ప్రణాళిక వికటించిందిః
కళ్లు పెట్టుకుని చూస్తే.. ఎవ్వరూ కూడా సిద్ధం సభలో జనం లేరని , జనాలు రాలేదని గానీ నోటి వెంట మాట రాని పరిస్థితి ఉండేది. అలాంటి రోత రాతలు రాసేవాళ్లు కూడా రాయరు గాక రాయరు. జనాలు తండోపతండాలుగా వచ్చారని చెప్పడం మీకు ఇష్టం లేక.. ఆ వీడియోలు చూపించలేకనే ఏదోకవిధంగా బురదజల్లి చంద్రబాబును సంతృప్తి పరచడమే ధ్యేయంగా ఎల్లోమీడియా పత్రికలు, ఛానెళ్లు పనిచేస్తున్నాయి. లక్షలాదిగా తరలివచ్చిన సభను మీరెంత అభాసుపాల్జేయాలని చూసినా మీ ప్రణాళిక వికటించలేదా..? ఎవరికి వారు మనం వెళ్లి చూసిన సభ గురించి ఎల్లోమీడియా ఇలా రాసిందేంటంటూ చర్చిస్తుంటే.. మీ ఎల్లోమీడియా పత్రిక, ఛానెళ్ల ప్రతిష్ట దెబ్బతింటుంది కదా..? ఇక, మిమ్మల్నెవరు నమ్ముతారు..?

చంద్రబాబు బతుకంతా అబద్ధాలే..ః
నోరుతెరిస్తే అబద్ధాలు చెప్పే వ్యక్తి రాజకీయాల్లో చంద్రబాబు ఒకేఒక్కరుగా చెబుతారు. ఆయన నోటి వెంట అబద్ధాలు తప్ప నిజాలు రావనేది జగమెరిగిన సత్యం. నిజం మాట్లాడకూడదనేది ఆయన పెట్టుకున్న ప్రధానమైన ఆలోచనా సిద్ధాంతం. నిజాలు మాట్లాడుతున్నంతసేపు ఆయన బలహీనంగా ఉంటాడు. అబద్ధాలు మాట్లాడినంతసేపు ఆయన లో బలం కనిపిస్తుంది. ఈ సందర్భంగా ఆయన్ను నేనొక ప్రశ్న అడుగుతున్నాను. ఇప్పటిదాకా నాలుగు సిద్దం సభలు జరిగాయి. ఉత్తరాంధ్ర, ఉత్తరకోస్తా, రాయలసీమలో సిద్ధం సభలు జరగ్గా.. నిన్న దక్షిణ కోస్తాలో మరో సభ జరిగింది. దాదాపు నెలన్నర రోజులుగా మా నాయకులు జగన్‌మోహన్‌రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్లి వారితో మమేకమై గతంలో తానేం చేశారో.. భవిష్యత్తులో తానేం చేయబోతున్నాననే విషయంపై కొంతమేర స్పష్టతనిచ్చారు. వీటితోపాటు చంద్రబాబు మోసం, దోపిడీ, మాయమాటలతో ప్రజల్ని బురిడీకొట్టించడాన్ని కూడా ప్రజల ముందుకు తీసుకెళ్లారు.  

జనం గుండెల్లో గుడికట్టుకున్న జగన్‌గారుః
చంద్రబాబు నిర్వహించిన రా.. కదలి రా మీటింగుల్లో ఎల్లోమీడియా ప్రతినిధులు తప్ప జనాన్ని చూపించించిన సందర్భం ఏదైనా ఉందా.. ఖాళీ కుర్చీలు తప్ప.. అక్కడేమీ ఉండదు. అయితే, చంద్రబాబు మాత్రం కాలర్‌ మైక్‌ పెట్టుకుని మైకెల్‌ జాక్సన్‌ మాదిరే మాట్లాడుతూ ఆయనొక్కడే కనిపించడం తప్ప సభకొచ్చిన జనాలను చూపించిన దాఖల్లాల్లేవు. మరి, మా నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి గారు ప్రజల్ని నమ్ముకున్నారు గనుకే ఆయన మాట్లాడుతున్నంతసేపు ప్రజల్ని చూపించారు. ఆయన జనం గుండెల్లో గుడికట్టుకున్నాడు. అదే నువ్వు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ప్రజల్ని ఎందుకు చూపించవు.? రా.. కదలి రా.. అని నువ్వు పిలుపునిస్తే జనం ఎవరూ పెద్దగా స్పందించడంలేదు. వచ్చిన అరాకొరా జనం నువ్వు ప్రసంగించకముందే తిరిగి వెళ్లిపోతున్నారు. నీ ముఖం చూడాలంటే జనం అలిగి వెళ్లిపోతున్నారు. 

జనం లేని పార్టీకి సేనాని పవన్‌కళ్యాణ్ః
రాష్ట్రంలోని జనమంతా జగన్‌మోహన్‌రెడ్డి గారి చుట్టూతా ఉంటే.. జనం లేని పార్టీకి సేనానిగా చెప్పుకుంటున్నాడు పవన్‌కళ్యాణ్‌. అలాంటోడిని పక్కనబెట్టుకుని ఏదో సాధించాలని ఇన్నాళ్లూ చంద్రబాబు తెగకష్టపడ్డాడు. తీరా, మనిద్దరి వల్ల కాదులే అని ఢిల్లీకి వెళ్లి మోకరిల్లి బీజేపీతో జతకట్టారు. నేటికి మీరు ముగ్గురయ్యారు. ఈ కూటమి ఈరోజుకు కొత్తేమీ కాదుగదా..? 2014లో కలిసి పోటీచేశారు గదా...? అంటే, మీది పాత కూటమినే కదా..? 2019లో ఎవరికి వారు విడిపోయి పోటీచేశారు. అప్పట్లో మోదీ గారిని నోటికొచ్చినట్లు వ్యక్తిగతంగా తిట్టి దుమ్మెత్తిపోస్తూ మాట్లాడావు. గోద్రాలో అంతమందిని చంపాడు.. నరహంతకుడు మోదీ అన్నావు. ప్రత్యేకహోదా ఇవ్వలేదన్నావు. అలాంటి నువ్వు మళ్లీ మోదీ చంకన ఎందుకెక్కావు..? ఆయనతో పాటు అమిత్‌షా, నడ్డా చుట్టూ ప్రదక్షిణలు చేశావు..? సీట్ల కేటాయింపులో ఒకరికొకరు పోటాపోటీగా త్యాగాలకూ సిద్ధపడ్డారు. చివరికి మీ పరిస్థితి ఎలా ఉంటుందంటే.. దూకడానికి గాను నీళ్లు లేని బావిని చూసుకోవడమేనని ప్రజలు స్పష్టమైన ఆలోచనతో ఉన్నారు. 

2024 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ సునామీ ఖాయంః
నేటికి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బలం ఎంత పుంజుకున్నదనేది నాలుగు సిద్ధం సభలతోనే తేటతెల్లమైంది. ప్రజల మద్ధతు మా పార్టీకి ఉంది. జగన్‌మోహన్‌రెడ్డి గారికి అన్నింటా వివిధ వర్గాల మద్ధతు లభిస్తోంది కనుక రేపటి ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ విజయదుందుభి మోగించడానికి సునామీ సృష్టించబోతుంది. గతం కన్నా ఈసారి భారీ సంఖ్యలో సీట్లు, అభ్యర్థుల మెజార్టీలు కూడా పెరుగుతాయి. మరలా, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తిరుగలేనటువంటి శక్తిగా ఆవిర్భవించి.. జగన్‌మోహన్‌రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖాయమనే సందేశం నిన్నటి సిద్ధం సభ ద్వారా ప్రజలు తెలియజేశారు.  

Back to Top