99 శాతం హామీలు పూర్తి చేసిన ఘనత  వైయస్ఆర్‌ ప్రభుత్వానిదే 

వైయ‌స్ఆర్ ఆస‌రా వారోత్స‌వాల్లో శ్రీ‌శైలం ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి
 

నంద్యాల జిల్లా:  ఎన్నిక‌ల మేనిఫెస్టోలో ఇచ్చిన 99 శాతం హామీల‌ను అమ‌లు చేసిన ఘ‌న‌త వైయ‌స్ఆర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వానిదేన‌ని శ్రీ‌శైలం ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి అన్నారు.  వైయ‌స్ఆర్ ఆస‌రా మూడో విడ‌త వారోత్స‌వాల్లో భాగంగా ఆత్మ‌కూరు ప‌ట్ట‌ణంలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజ‌రై ప్ర‌సంగించారు.  రాష్ట్రంలో ఎక్కడ కూడా సెంటు మాత్రమే ఇంటి స్థలాలు ఇచ్చారని కేవలం మన ప్రభుత్వం  ద్వారా త‌న చొరవతో  ఈ రోజు ఆత్మకూరు టౌన్ లో సెంటున్నర స్థలం ఇచ్చామ‌ని చెప్పారు.  ఇటీవ‌ల‌ జరిగిన అసెంబ్లీ సమావేశంలో హైవే నిర్మాణం కార‌ణంగా ఇల్లు  న‌ష్ట‌పోతున్నార‌ని ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లిన‌ట్లు చెప్పారు.  గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి గల వ్యత్యాసాన్ని మ‌హిళ‌లు గ‌మ‌నించాల‌ని సూచించారు.  వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం ద్వారా మహిళలకు  పార్టీ పదవులలో గాని రాజ్యాంగ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఘనత మన సీఎం వైయ‌ష్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికే ద‌క్కుతుంద‌న్నారు. మహిళలందరూ సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో ఎన్నో సంక్షేమ పథకాలు మీ ఇంటి ముందుకే తీసుకొస్తున్నామని తెలిపారు.  దేశంలో ఎక్కడ కూడా లేని విధంగా ఈరోజు అభివృద్ధి దిశలో రాష్ట్ర ముందుకు వెళ్తుందని చెప్పారు.  రానున్న రోజుల్లో మళ్లీ అందరూ మీ ఆశీర్వాదాలు  మన ప్రభుత్వం మీద ఉండాలని ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ఈ సంద‌ర్భంగా ఆత్మకూరు మండలంకు సంబంధించి 909  పొదుపు సంఘాలకు 4,54,00,000 రూపాయలకు సంబంధించి భారీ చెక్కును మహిళలకు ఎమ్మెల్యే అంద‌జేశారు. అనంత‌రం రాష్ట్ర ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం చేశారు. కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్‌సీపీ నియోజ‌క‌వ‌ర్గ నాయ‌కుడు శిల్పా భువ‌నేశ్వ‌ర్‌రెడ్డి,   జెడ్పిటిసి సభ్యులు శివశంకర్ రెడ్డి, ఎంపీపీ నల్లకాలవ తిరుపాలమ్మ, ఆత్మకూరు మున్సిపల్ చైర్‌ప‌ర్స‌న్ డాక్టర్ ఆసియా మారూఫ్‌, ప్ర‌జాప్ర‌తినిధులు, పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, పొదుపు సంఘాల మ‌హిళ‌లు పాల్గొన్నారు.   

Back to Top