తాడేపల్లి: జగనన్న విదేశీ విద్యా దీవెన కార్యక్రమం చరిత్ర పుటల్లో లిఖించదగిన కార్యక్రమని సాంఘీక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాలకు చెందిన పేద విద్యార్ధులు ప్రపంచంలోని టాప్ యూనివర్శిటీలలో ఉన్నత విద్యా కోర్సులు అభ్యసించేందుకు అవసరమైన ఆర్ధిక సాయం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న విదేశీ విద్యా దీవెన కార్యక్రమాన్ని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడారు.

నమస్కారం, చాలా గొప్ప కార్యక్రమం ఇది, ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు ఉన్నత కులాలలోని పేదవారి పిల్లలకు ఇది గొప్ప అవకాశం. గతంలో విదేశీ విద్య పేరుతో పిల్లలు ఏ విధంగా బాధపడ్డారో, కుటుంబాలు ఎలా నలిగిపోయాయో ప్రజలకు తెలియాలి. ఇంతకుముందు విదేశీ విద్యకు వెళ్లాలంటే డబ్బులు వస్తాయని ఎదురుచూసి, తర్వాత బ్యాంకుల నుంచి డబ్బు రాక చదువులు మానేసిన పరిస్ధితి ఉండేది. అంతేకాక ఒక కోర్సుకు పర్మిషన్ తీసుకుని మరో కోర్సు చదివిన పరిస్ధితి, ఒక దేశానికి పర్మిషన్ తీసుకుని వేరే దేశంలో చదువులకు వెళ్ళిన పరిస్ధితి, దీనిపై విజిలెన్స్ రిపోర్ట్ కూడా చాలా అవకతవకలు జరిగాయని ఇచ్చింది. అన్నా మీరు సీఎం అయిన తర్వాత ఈ రాష్ట్రంలో పేదల స్ధితిగతులు మార్చాలని, విద్యావిప్లవాన్ని తీసుకొచ్చి ముందుకెళుతున్నారు. విదేశీ విద్యకు మీరు ఇస్తున్న ప్రాధాన్యత గొప్ప చరిత్ర, ఇది నభూతో న భవిష్యత్, అందరికీ ఒక మాట చెబుతున్నా, విదేశీ విద్యపై అపోహలు నమ్మకుండా రూ. 1.25 కోట్లు ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలకు సీఎంగారు ఇస్తున్న ఈ యజ్ఞంలో భాగస్వామ్యం అవ్వాలని కోరుకుంటున్నాను. చరిత్ర పుటల్లో లిఖించదగిన కార్యక్రమం ఇది. ధ్యాంక్యూ.
దేశానికే ఆదర్శం: డిప్యూటీ సీఎం, మైనార్టీ శాఖ మంత్రి అంజాద్ బాషా
గుడ్ మార్నింగ్, ఇవాళ చాలా శుభప్రదమైన రోజు, విద్యార్ధులంతా చాలా రోజులుగా ఎదురుచూస్తున్న రోజు, విదేశాలకు వెళ్ళి ఒక ఉజ్వలమైన భవిష్యత్ కోసం ఆకాంక్షించే విద్యార్ధులకు చాలా శుభప్రదమైన రోజు. సీఎంగారు మీరు విద్యారంగంలో అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి, ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించాలని, పేదరికం విద్యకు అడ్డు రాకూడదని మీరు చేస్తున్న కృషి దేశానికే ఆదర్శంగా నిలిచింది. క్షేత్రస్ధాయి నుంచి ప్రతి విద్యార్ధికి అన్ని రకాలుగా సహకరిస్తూ విదేశాలకు కూడా వెళ్ళి విద్యను అభ్యసించేందుకు మీరు సువర్ణావకాశాన్ని ఇస్తున్నారు. గతంలో ఎలాంటి అవకతవకలు జరిగాయో తెలుసు. మీరు తీసుకున్న ఈ నిర్ణయం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలకు కూడా ఉపయోగపడుతుంది, విదేశాలకు వెళ్ళి విద్యను అభ్యసించడం కల, కానీ మీరు దానిని నెరవేరుస్తున్నారు. టాప్ 100 యూనివర్శిటీలలో సీటు సంపాదించిన విద్యార్ధులకు, మిగిలిన విద్యార్ధులకు మీరు చేస్తున్న సాయం గతంలో ఏ ప్రభుత్వం చేయలేదు. మీరు వేసిన బాట విద్యార్ధుల ఉజ్వల భవిష్యత్‌కు ఉపయోగపడుతుంది. ధ్యాంక్యూ.

బండి సుచరిత, కృష్ణా జిల్లాకు చెందిన విద్యార్ధిని, హార్వర్డ్ యూనివర్శిటీలో గ్లోబల్ హెల్త్ అండ్ పాపులేషన్‌పై మాస్టర్స్ చదువుతూ బోస్టన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు
గుడ్ మార్నింగ్ సార్, సీఎంగారికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు, ఈ స్కీమ్ చాలా అద్భుతంగా ఉంది, విద్యారంగంలో ఇది గొప్ప పథకం, మెరుగైన సమాజ నిర్మాణానికి విద్య ఒకటే మార్గమని సీఎంగారు చెప్పిన విధంగా ఈ పథకం ఒక చారిత్రాత్మకం, సీఎంగారికి, ఏపీ ప్రభుత్వానికి మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు, ధ్యాంక్యూ సార్ అని ముగించగా వెల్కమ్, విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్, మే గాడ్ బ్లెస్ యూ అంటూ సీఎం చెప్పారు.
అల్లాడి జ్యోతిర్మయి, ఏలూరుకు చెందిన విద్యార్ధిని, వార్విక్ యూనివర్శిటీలో పీజీ ఇన్ పబ్లిక్ హెల్త్, కోవెంటీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు
హలో సార్, ఇంత గొప్ప యూనివర్శిటీలో చదవడం చాలా గర్వంగా భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నేను చిన్నప్పటి నుంచి సోషల్ వెల్ఫేర్ స్కూల్స్, కాలేజీలలో చదివి ఈ రోజు ఇక్కడికి రాగలిగాను, ధ్యాంక్యూ సార్ అని ముగించగా వండర్‌ఫుల్ స్టోరీ అంటూ సీఎంగారు ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పారు.
నిరూషాదేవి, బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన విద్యార్ధిని, యూనివర్శిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్‌లో ఎంబీఏ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్, బర్మింగ్‌హామ్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు
గుడ్ మార్నింగ్ సార్, జగనన్న విదేశీ విద్యా దీవెన స్కీమ్ ద్వారా నేను బర్మింగ్‌హామ్ యూనివర్శిటీలో ఎంబీఏ చదువుతున్నాను. సీఎంగారు మీరు విద్యావ్యవస్ధలో మీరు తీసుకొస్తున్న సంస్కరణల వల్ల మాలో ఆత్మవిశ్వాసం పెంపొందింది, మా విద్యార్ధుల జీవితాల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి, మా కుటుంబాలు కూడా ఆర్ధికంగా నిలదొక్కకుంటున్నాయి, మా యువతకు మీరు ఒక ఆదర్శం, నేను చదువుతున్న ఇదే యూనివర్శిటీలో మన దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్ధులు కూడా ఉన్నారు కానీ వారికి ఎవరికీ కూడా ఇలాంటి స్కీమ్స్ లేవు. మన దేశంలో ఏ సీఎం కూడా ఇలాంటి స్కీమ్ ఏర్పాటుచేయలేదు, థ్యాంక్యూ సార్, విదేశాలలో ఉన్నత విద్యను చదవాలన్న కలను మీరు నెరవేరుస్తున్నారు. థ్యాంక్యూ సో మచ్ సార్.

యోగేంద్ర నాగ సాత్విక్, కృష్ణా జిల్లాకు చెందిన విద్యార్ధి, గ్లాస్గో యూనివర్శిటీలో ఎంఎస్‌సీ ఇన్ డేటా సైన్స్, గ్లాస్గో నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు
గుడ్ మార్నింగ్, థ్యాంక్యూ వెరీమచ్ సీఎం సార్, మా విద్యార్ధుల కలను మీరు నెరవేరుస్తున్నారు. ఇలాంటి టాప్ యూనివర్శిటీలలో చదవాలన్న మా కోరికను మీరు నెరవేర్చుతున్నారు, కృతజ్ఞతలు. నేను ఇక్కడే పీహెచ్‌డీ చేసి ఫ్రొఫెసర్‌గా చేస్తూ ఎంతోమంది నాలాంటి విద్యార్ధులకు భోదించాలనే లక్ష్యంతో ముందుకెళుతున్నాను. నా కుటుంబానికి ఇంత పెద్ద యూనివర్శిటీలలో చదివించే స్ధోమత లేదు. కానీ మీరు మా కల నెరవేరుస్తున్నారు. నాలాంటి ఎంతోమంది పేద విద్యార్ధులకు మీరు చేసే సాయం ఎప్పటికీ మరువలేము, ధ్యాంక్యూ వెరీమచ్ సార్.

షేక్ మస్తాన్ వలీ, విద్యార్ధి తండ్రి, గుత్తికొండ, పల్నాడు జిల్లా, వాళ్ళ కుమారుడు షేక్ కమల్‌హాసన్, యూనివర్శిటీ ఆఫ్ విస్కాన్‌సిన్‌లో పుడ్ సైన్స్ చదువుతున్నాడు.
షేక్ మస్తాన్ వలీ
జగనన్నా నమస్కారం, నేను ఒక సామాన్య రైతు కుటుంబం, నేను ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి రావడంతో ఉన్నత చదువులు చదవలేకపోయాను, నా పిల్లలను అయినా ఉన్నత చదువులు చదివించాలనుకున్నా, నాన్నగారు మైనార్టీలకు ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్ల వల్ల నా కుమారుడు కమల్‌హాసన్‌కు తిరుపతి ఎస్‌వీ యూనివర్శిటీలో డెయిరీ టెక్నాలజీలో సీట్ పొందగలిగాడు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళతానంటే ఆర్ధిక స్ధోమత లేదన్నాను, కానీ మీరు ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్ధలోని ఉద్యోగులు జగనన్న విదేశీ విద్యా దీవెన స్కీమ్ గురించి చెప్పగానే అప్లికేషన్ పెట్టాం, మా అబ్బాయికి విస్కాన్‌సిన్ యూనివర్శిటీలో సీట్ రావడమే కాదు పైగా పూర్తి ఫీజు రీఇంబర్స్‌మెంట్‌తో వచ్చింది. విదేశాలలో చదవడం మాకు ఒక కల, అది మీ ద్వారా నెరవేరింది. మా ఆనందానికి అవదుల్లేవు, మేం మీ ద్వారా చాలా పథకాలు పొందాం, మా కుటుంబానికి చాలా లబ్ధి జరిగింది. గ్రామ సచివాలయ వ్యవస్ధలో మా మేనమామ పిల్లలు నలుగురికి ఉద్యోగాలు వచ్చాయి, మాకు రైతు భరోసా సాయం అందుతుంది, ఇంతకంటే మాకు ఏం కావాలి, మీ వల్ల నాకు వ్యక్తిగతంగా రూ. 40 లక్షల నుంచి రూ. 50 లక్షల లబ్ధి చేకూరింది. అన్నా మళ్ళీ మీరే సీఎం అయి మాలాంటి సామాన్య కుటుంబాలకు మీ పథకాల ద్వారా ఆర్ధిక పరిపుష్టిని మరింతగా అందించాలి, మీకు ధన్యవాదాలు అన్నా.