అసెంబ్లీ: జగన్నాథుడి రథచక్రాల కింద నలిగిపోయిన తెలుగుదేశం పార్టీ సభ్యుల జీవితం ఎప్పుడూ బ్యాడ్ మార్నింగే. సీఎం వైయస్ జగన్ పాలన చూసిన తరువాత టీడీపీకి భవిష్యత్తు లేదని తెలిసిపోయింది అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. అసెంబ్లీలో మార్షల్స్‌పై దాడి చేసిన టీడీపీ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శాసనసభలో మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడారు.
హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేశారని మాట్లాడుతున్నారు. ఆ పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఎన్టీఆర్‌ను ఏ మేరకు గౌరవించారో అందరికీ తెలుసు. అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ పేరు ఒక జిల్లాకు పెట్టాం. స్పీకర్ పోడియం ఎక్కి కాగితాలు చించివిసిరారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పయ్యావుల కేశవ్, రామనాయుడు, బాల వీరాంజనేయులు, రామనాయుడు సెక్యూరిటీ ఇన్‌చార్జ్‌ను బహిరంగంగానే కొట్టారు. పయ్యావుల కేశవ్ రౌడీలా సభలో ప్రవర్తించాడు. వీధి రౌడీగా ఉండి మర్డర్ కేసులో విజయవాడ నుంచి విశాఖపట్నంలో స్థిరపడిన రామకృష్ణబాబు పోలీసులపై చేయి చేసుకున్నారు.
దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి భారతదేశంలోనే మంచి ముఖ్యమంత్రిగా పేరుతెచ్చుకున్నారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలల్లో ఆరోగ్యశ్రీ పేదల ఆరోగ్యానికి అండగా నిలిచింది. పేద ప్రజల కోసం ఆలోచన చేసే రూపాయి డాక్టర్‌గా వైయస్‌ఆర్‌కు పేరుంది. అలాంటి మహనీయుడి పేరు హెల్త్ యూనివర్సిటీకి పెడితే బాగుంటుందని భావించాం. సీఎం వైయస్ జగన్ ఏ మండలానికి వెళ్లినా బ్రహ్మండమైన ఆస్పత్రి, జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నారు. తప్పకుండా హెల్త్ యూనివర్సిటీకి వైయస్ రాజశేఖరరెడ్డి పేరు ఆమోదయోగ్యం అని భావిస్తున్నాం.