సామాజిక సాధికారతలో దేశానికే ఆంధ్రప్రదేశ్ రోల్‌మోడల్‌

ప్రజాసంక్షేమం కోసం పనిచేసే నిరంతర శ్రామికుడు సీఎం జగన్‌ – ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి.

మనకు వెలుగునిచ్చే దీపం జగనన్న – డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా.

 సామాజిక సాధికార విప్లవ సారధి సీఎం జగన్‌ – మంత్రి మేరుగ నాగార్జున.

అంబేద్కర్, ఫూలే ఆదర్శాలతో సాగుతున్న జగనన్న – మంత్రి ఆదిమూలపు సురేష్‌

కనిగిరి: కనిగిరి నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సుయాత్రకు జనం పోటెత్తారు. అటు ర్యాలీలో వేలాదిగా పాల్గొన్న జనం, సభాస్థలికి చేరుకోగానే జనసంద్రాన్ని తలపించారు. జై జగన్‌ నినాదాలతో సభాస్థలి హోరెత్తింది. అత్యంత ఉత్సాహంగా జనం...సభ ఆసాంతం కదలకుండా నిలుచున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా, మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్, ఎంపీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, బీద మస్తాన్‌రావు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. సీఎం జగన్‌ చేసిన సంక్షేమం, అభివృద్దిల గురించి వక్తలు చెబుతుంటే ప్రజలు ఆసక్తిగా విన్నారు. మళ్లీ సీఎంగా జగనే రావాలంటూ నినదించారు. సభలో వక్తలు ఏమన్నారంటే...

 

డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా మాట్లాడుతూ...

 

– సామాజిక సాధికార బస్సు యాత్ర చరిత్రలో నిలిచిపోయే అధ్యాయం. 

– స్వతంత్రం వచ్చిన ఇన్నేళ్లలో బడుగు,బలహీనవర్గాలను ఓటు బ్యాంకుగా చూసిన రాజకీయాలనే చూశాం.

– బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ముఖ్యమంత్రులుగా పనిచేసిన రాష్ట్రాల్లోనూ సామాజిక సాధికారత ఒక నినాదంగానే మిగిలిపోయింది. కానీ ఈరోజు మన రాష్ట్రంలో జగనన్న పాలనలో సామాజిక సాధికారత కళ్ల ముందు కనిపిస్తోంది. 

– జగనన్న కేబినెట్‌లో మంత్రులుగా 70శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వర్గాల వారే ఉన్నారు.  

–మనం ఎక్కడ ఉన్నా పిలిచి మరీ పదవులు ఇచ్చిన జగనన్న పాలన ఓ విప్లవం. 

– ఎప్పుడైతే ఎన్నికలొస్తాయో అప్పుడే బీసీలు, ఎస్సీలు,ఎస్టీలు, మైనార్టీలు గుర్తుకొస్తారు చంద్రబాబుగారికి. తర్వాత వారిని లెక్కలోకి కూడా తీసుకోరు. –అవకాశం వచ్చినప్పుడల్లా వారిని అవమానించిన చరిత్ర చంద్రబాబుది.

–ప్రజల కోసం పనిచేసే నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి. ఎన్నికలతో సంబంధం లేకుండా ఎన్నో సంక్షేమ పథకాలతో వెనుకబడిన, బలహీన, పేద గడపల్లో వెలుగులు పంచుతున్న జగనన్న పాలనకు ఎవరైనా జై కొట్టాల్సిందే. 

 

మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ..

– ఇక్కడకు వచ్చిన జనాలను చూస్తుంటే...జనసంద్రాన్ని తలపిస్తున్నారు.  ఇదంతా జగనన్న ఘనతే. 

– అంబేద్కర్, జ్యోతిరావుఫూలే, మౌలానా అబుల్‌ కలామ్‌ అజాద్‌లాంటి మహానుభావులు సామాజిక సాధికారత గురించి ఆలోచించారు. వారి ఆశయాల బాటను ఎంచుకున్న జగన్‌మోహన్‌రెడ్డి సామాజిక విప్లవాన్నే తీసుకొచ్చారు. 

– అనేక అవమానాలు, కష్టాలు చూసిన వెనుకబడ్డ వర్గాల ప్రజలమైన మనకు మంచి  రోజులు వచ్చాయంటే దానికి ప్రధాన కారణం జగనన్న. 

– ఈ రోజు పేదవాడికి సంక్షేమ పథకాలు అందాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఆత్మగౌరవంతో తలెత్తుకు తిరగాలని ఆలోచించే నాయకుడు జగనన్న రూపంలో వచ్చాడు. 

–అభూతకల్పనలతో జగనన్నను విమర్శిస్తున్న చంద్రబాబు, ఆయన బృందాన్ని మించిన మోసకారి ముఠా ఇంకొకటి ఉండదు. 

–జగనన్నే మన నమ్మకం. ఆ నమ్మకంతోనే ఆయన్ను గెలిపించుకుందాం. మనకు మరింత మేలు జరిగేలా చూసుకుందాం.

 

మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ...

–సామాజిక సాధికారత గురించి మా కంటే కనిగిరి ప్రజలకే ఎక్కువ తెలుసు.  –2014లో మాయమాటలు నమ్మి, చంద్రబాబును గెలిపించారు. తర్వాత ఎంత మోసపోయారో అందరికీ అర్థమయింది. 

–2019లో జగనన్నకు కనివిని ఎరుగని రీతిలో పట్టం కట్టారు ప్రజలు. ఈసారి వారు మోసపోలేదు. ప్రజాపాలన అంటే ఏమిటో.. ప్రజానాయకుడు అంటే ఏమిటో చూస్తున్నారు. తనను తాను ప్రజాసేవకుడిగా చెప్పుకుంటూ, సంక్షేమపథకాలు అందిస్తున్న మహానేత తనయుడు జగనన్న. 

–మన అక్కచెల్లెమ్మలకు ఆర్థికంగా చేయూతనందించడంతో పాటు,మహిళా సాధికారతకోసం ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. 

–మన బాధలు తెలిసిన వ్యక్తి. మన గుండె తడి తెలిసిన వ్యక్తి. జవాబుదారీతనం, పారదర్శకత, అవినీతిరహితపాలన, నిజాయితీలతో పాలన చేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి.  

–ఇచ్చిన ప్రతిహామీని నెరవేర్చాలని తపిస్తూ...ఇప్పటికే 99శాతం హామీలను నెరవేర్చిన అసలు సిసలు ప్రజానాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి. 

–మనల్ని ఓటుబ్యాంకులుగానే వాడుకున్నవారికి బుద్దిచెప్పి తీరాల్సిందే. 

 

ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ..

– ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులందరినీ కలిపి బస్సుయాత్ర తలపెట్టడం గొప్ప ఆలోచన. ఆ వర్గాలకు జరిగిన మంచిని ప్రజలకు తెలియచెప్పడమన్నది ముఖ్యమైన పని. 

–జగన్‌మోహనరెడ్డి ఆశయ సాధనకు మనమందరం కలిసి పనిచెయ్యాలి. 

– కనిగిరిలోని మారుమూల ప్రాంతాల నుంచి కూడా ఇక్కడకు 

తరలివచ్చిన ప్రజలను చూస్తుంటే.. జగన్‌మోహన్‌రెడ్డిపై వారికున్న అభిమానం ఎంతో తెలుస్తోంది. 

– కనిగిరి ప్రజలకు వెలిగొండ ప్రాజెక్టు ద్వారా తాగు, సాగునీరు అందే సమయం అట్టే దూరం లేదు. డిసెంబర్‌లో ఆ కల నెరువేరుతుంది. ఇది జగనన్న సంకల్పమే.

 

ఎంపీ బీద మస్తాన్‌రావు మాట్లాడుతూ...

–సామాజిక సాధికారత విషయంలో దేశంలోనే ఒక రోల్‌మోడల్‌గా నిలిచారు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. 

–ఎంతో ఆదర్శవంతంగా పనిచేస్తున్న జగనన్న వల్ల ఈరోజు పార్లమెంటు, రాజ్యసభల్లో వెనుకబడిన వర్గాల వారు ఉన్నారు. ఎనిమిదిమంది రాజ్యసభ ఎంపీలలో... నలుగురు బీసీకులాలవారే అని గర్వంగా చెప్పగలం.

– చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని పార్లమెంటులో మాట్లాడేలా చేసిన నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి. 

– కులగణన చేస్తే బీసీలకు న్యాయం జరుగుతుందని గట్టిగా నమ్మడమే కాకుండా, ఆ దిశలో ముందడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి జగనన్న. 

– స్థానిక సంస్థల్లో  బీసీలకు అత్యధికంగా అవకాశం కల్పించింది జగనన్నే. 

– వైయస్సార్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ద్వారా మన వర్గాల పిల్లలుపెద్ద చదువులు చదవగలిగారు. 

– ఆరోగ్యశ్రీ పేదలకు వరమయింది. కార్పొరేట్‌ వైద్యం కూడా పేదలకు అందుబాటులోకి వచ్చింది. ఈ విషయంలో తండ్రికన్నా ఎక్కువగా చెయ్యాలని జగనన్న తపిస్తున్నారు. 

 

ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ మాట్లాడుతూ...

–సభ ఆసాంతం కదలకుండా నిలబడి, ఉపన్యాసాలు విన్న కనిగిరి ప్రజలను చూస్తుంటే..జగనన్నపై ఎంత అభిమానం ఉందో అర్థమవుతోంది. సమయం చిక్కినప్పుడల్లా జై జగనన్న అని నినదిస్తున్న ప్రజలను చూస్తుంటే, జగనన్న జనం గుండెల్లో ఉన్న నాయకుడు అని అర్థమవుతోంది.

–జగనన్నను విమర్శిస్తున్న బాబు, ఆయన పార్టీనాయకులు చెప్పే వన్నీ అబద్దాలే. చేసేవన్నీ మోసాలే. ఈ విషయం ప్రజలందరికీ తెలిసిన విషయమే. 

–ప్రజాక్షేమం కోసం ఎన్నో సంక్షేమపథకాలు ప్రవేశపెట్టిన జగనన్న మన నమ్మకం. మనకు మంచి చెయ్యాలని తపిస్తున్న జగనన్న కాపాడుకోవాల్సిన అవసరం మనందరికి ఉంది. 

 

ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ మాట్లాడుతూ...

–అన్న కటౌట్‌ చాలు...ఆయన్ను గుండెల్లో పెట్టుకున్న వేలాది జనం కదిలివస్తారని ఈ రోజు తెలిసింది. 

–బీసీనైన నేను ఎక్కడో ఉంటే...  పిలిచి ఎమ్మెల్యేగా నిలబెట్టారు జగన్‌సార్‌.  అప్పుడు  ఓడిపోతే, ధైర్యం చెప్పి 2019 ఎన్నికల్లో నిలబెట్టి గెలిపించిన నాయకుడు జగనన్న. 

–అసెంబ్లీలో నీవు నా పక్కన కూర్చోవాలని చెప్పి, మరీ నన్ను గెలిపించారాయన. –అభివృద్ది పేరిట రూ.3,473 కోట్ల నిధులు కనిగిరికి వచ్చాయి. కనిగిరి ప్రజలు కోరుకున్న తాగునీరు, సాగునీరు పనులు పూర్తయ్యే దశలో ఉన్నాయి.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top