టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మరణం వెనుక సిట్‌ వేధింపులు

సిట్‌ వేధింపులు భరించలేకే బలవన్మరణానికి పాల్పడ్డారని సన్నిహితులు నుంచి సమాచారం వచ్చింది

పరకామణి కేసులో విచారణ పేరుతో సతీష్ ను బెదిరించారని వెల్లడి అవుతోంది

ఈ పాపం చంద్రబాబు ప్రభుత్వానిదే

సతీష్ కుమార్ ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరిపించాలి

అక్రమ కేసులు పెట్టి రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీయాలని కుట్రలు చేస్తున్నారు

ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇలాంటి కుట్రలే

ఈ పన్నాగానికి సహకరించకపోతే చివరకు పోలీసు అధికారులనూ విడిచిపెట్టడంలేదు

పోలీసు అధికారులనుకూడా వేధింపులకు గురిచేస్తున్నారు.

చంద్రబాబు ప్రభుత్వం దాష్టీకానికి పోలీసు అధికారి బలయ్యారు.

అందుకే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ చేయాలి

టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ 

తిరుపతిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.

వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై తప్పుడు కేసులే  ప్రభుత్వ లక్ష్యం

అందుకు అధికారులను పావులుగా వాడుకుంటున్న ప్రభుత్వం

పరకామణి కేసులో నా పేరు చెప్పాలని సతీష్ పై ప్రభుత్వ ఒత్తిడి

విచారణలో న్యాయమూర్తి ఆదేశాలనూ బేఖాతరు చేసిన ప్రభుత్వం

ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడ్డ భూమన కరుణాకర్ రెడ్డి

తిరుపతి:  టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మరణం వెనుక సిట్ వేధింపులు ఉన్నాయి. ఇది ముమ్మాటికే ప్రభుత్వ హత్యేనని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. తిరుపతిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... పరకామణి కేసులో విచారణ ఎదుర్కొంటున్న మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ప్రభుత్వ ఒత్తిడి, బెదిరింపులతో ఆత్మహత్యకు పురిగొల్పారని, విచారణ పేరుతో తీవ్ర వేధింపులకు గురిచేసి ఆయన మృతికి కారణమైనట్టుగా సన్నిహితులు సమాచారం అందించారన్నారు. దీనిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరిపించాలని భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

గడిచిన రెండు నెలలుగా పత్రికల్లో పరకామణికి సంబంధించిన వార్తల వల్ల కూడా సతీష్ కుమార్  తీవ్రంగా కలత చెందారు. మరోవైపు వారం రోజులగా సీఐడీ విచారణ నేపధ్యంలో... వారిదీనిపై  వేధింపులు తాళలేక.. ఈ బ్రతుకు కంటే ఆత్మహత్య చేసుకోవడం మేలని ఆయన సన్నిహితులతో వాపోయినట్లు సమాచారం వచ్చింది. ఇది అత్యంత బాధాకరమైన విషయం. సతీష్ కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబానికి వైయ‌స్ఆర్‌సీపీ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. 

సతీష్ కుమార్ ది ప్రభుత్వ హత్యే...

కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా, బలవంతంగా సతీష్ కుమార్ ఒత్తిడి తీసుకునిరావడంతోపాటు మానసిక క్షోభకు కూడా గురి చేసింది. తద్వారా నా పేరు తీసుకొచ్చి నిందితుడిగా చేర్చడానికి కూడా అధికారులు సతీష్ ను బలవంతం చేశారు. ఎవరి ఒత్తిడి వల్ల చేశావని అడిగితే.. ఆనాటి నా పై అధికారి సీవీఎస్వీ నరసింహ కిషోర్ చెప్పడం వల్ల రాజీకీ వెళ్లానని చెబితే.. సతీష్ ను నానా తిట్లు తిట్టారు. పోలీసు అధికారులచే.. రాజకీయ నాయకులను ముద్దాయిలుగా చేర్చడానికి చంద్రబాబు ప్రభుత్వం పన్నిన కుట్రకు బలై ఒక అమాయకుడు, సౌమ్యుడు, నిజాయితీపరుడైన పోలీస్ అధికారి బలయ్యాడు. ఇది ప్రభుత్వ హత్య తప్ప మరొక్కటి కాదు. 
పరకామణి కేసులో విచారణ చేస్తున్న అధికారులు...  గౌరవ న్యాయమూర్తి గారి ఆదేశాలకు భిన్నంగా విచారణ చేస్తూ... విచారణ ఎదుర్కొంటున్న అధికారులను మానసిక వేధింపులకు గురిచేస్తున్నారు. రౌడీలు, గుండాల తరహాలో పచ్చి బూతులు తిడుతూ పోలీసు అధికారులనూ విచారణ ఎదుర్కొంటున్న వారిని వేధిస్తున్నారు. సీఐడీలో భాగస్వామి కాకపోయినా,  ఏ విచారణ అర్హత లేని లక్ష్మణ్ రావు అనే క్రిమినల్ కూడా విచారణలో కూర్చుని సతీష్ కుమార్ ని బండబుూతులు తిట్టాడు.

సీబీఐ విచారణ జరిపించాలి..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తోంది. అధికారంలో వచ్చిన వెంటనే పరకామణిపై టీటీడీ విజిలెన్స్ ఎంక్వైరీ చేసింది. ఆ తర్వాత ప్రభుత్వం విజిలెన్స్ శాఖ ద్వారా కూడా విచారణ చేయించి ఆ నివేదికను సీఎం చంద్రబాబుకి అప్పగించారు. పత్రికా సమావేశంలో సీఎం మాట్లాడుతూ... దేవుడికి అన్యాయం చేసిన వాళ్ల దగ్గర వడ్డీతో సహా రాబట్టుకుంటాడు అని సమాధానం దాటవేశాడు. ఇప్పుడు న్యాయమూర్తి ఆదేశాలను తమకు అనుగుణంగా... ప్రభుత్వం చేస్తున్న అపచారాలను మీద మాట్లాడుతున్న నన్ను దోషిగా ఇరికించేందుకు టీటీడీ పాలకమండలి అధ్యక్షుడు నుంచి లోకేష్ వరకూ ఏ రకంగా మాట్లాడారో, ట్వీట్లు చేశారో అందరికీ తెలుసు.  దీని వెనుక చాలా పెద్ద కుట్ర ఉంది. సతీష్ కుమార్ గురించి తిరుమల లో ఉన్న వీజీఓ ఎన్ని సార్లు బలవంతంగా మాట్లాడాడో బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఏవీఎస్వీ, నా మీద నిరంతరం దాడి చేసిన పాలకమండలి సభ్యుడు.. వీళ్లందరూ మృతి చెందిన సతీష్ కుమార్ తో మాట్లాడిన మాటలు బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ రైల్వే అధికారిగా పనిచేస్తున్న  సతీష్ కుమార్ మరణం వెనుక కుట్ర ఉంది. అది బయటకు రావాలంటే ప్రభుత్వం సీబీఐ విచారణ చేయించాలి. దమ్ముంటే మీరు సీబీఐ విచారణకు ఆదేశించాలి. మరోవైపు పదిరోజులగా జరుగుతున్న సీఐడీ  విచారణ తతంతంగ మీద, న్యాయమూర్తి గారి ఆదేశాలకు భిన్నంగా నన్ను ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్న విచారణ మీద కూడా సీబీఐతో దర్యాప్తు చేయించాలి. ఇంత దారుణంగా భగవంతుడి పేరు చెప్పుకుని మమ్నల్ని ఇరికించే ప్రయత్నం చేస్తూ.. రోజూ దాడి చేస్తున్నారు. ఎలాగైనా మా పై కేసులు నమోదు చేసి...  జైలుకు పంపించాలన్న తాపత్రయంతో చేసిన  ప్రభుత్వ దాష్టీకానికి ఒక అమాయక పోలీసుఅధికారి బలయ్యాడు. ఆ విచారణ చేయిస్తున్న ఎస్పీ గంగాధర్, డీయస్పీలు వేణుగోపాల్, గణపతిలు అత్యంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. గౌరవ న్యాయమూర్తి ఆదేశాలకు భిన్నంగా విచారణ చేస్తున్నారు. ఈ విచారణపై కచ్చితంగా సీబీఐ దర్యాప్తు జరగాలని విజ్ఞప్తి చేస్తున్నాను. పోలీసు అధికారుల మీదే ఆత్మహత్యలకు పురికొల్పే విధంగా జరుగుతున్న విచారణల వల్ల... సదరు పోలీసుల మనో ధైర్యం దెబ్బతింటుంది. ఇది పోలీసు సమాజానికి అవమానకరమైన విషయం.  పోలీసులను చూస్తే.. గుండాలు, దోపిడీదార్లు, దొంగలు భయపడతారు.. కానీ విచారణ పేరుతో సాటి పోలీసులనే వేధిస్తూ.. తప్పుడు కేసులు నమోదు చేస్తూ.. ప్రభుత్వం తప్పుడు సాంప్రదాయానికి తెరతీసింది. దాని ఫలితమే పోలీస్ అధికారి సతీష్ కుమార్ ఆత్మహత్య. దీనిపై కచ్చితంగా సీబీఐ విచారణ జరిపించాలి. సతీష్ కుమార్ మరణానికి కారణమైన ప్రభుత్వం, పోలీస్ అధికారులతో పాటు ఆయన మీద ఒత్తిడి తెచ్చినవారందరినీ దోషులుగా చేర్చి, నిందితులుగా మార్చి జైలుకు పంపించాలని కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.

Back to Top